For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఫినాలేలో 10 లక్షలు తీసుకున్న కంటెస్టెంట్.. షో చరిత్రలో రెండోసారి ఇలా!

  |

  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని కాన్సెప్టు.. అప్పుడప్పుడూ మజాను పంచే ఎంటర్‌టైన్‌మెంట్.. ఊహించని ఎలిమినేషన్స్.. అబ్బురపరిచే ట్విస్టులు.. భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ సీన్స్ ఇలా ఎన్నో సంఘటనల సమాహారమే బిగ్ బాస్ షో. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి తెలుగులో విశేషమైన స్పందన దక్కింది. ఫలితంగా ఇప్పటికే ఐదు సీజన్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ఫినాలేలో ఓ కంటెస్టెంట్ పది లక్షల రూపాయల డీల్‌కు ఒప్పుకుని ఎలిమినేట్ అయినట్లు ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

   తుది దశకు... ఏడుగురు పోటీ

  తుది దశకు... ఏడుగురు పోటీ


  ఎన్నో అంచనాల నడుమ మొదలై 12 వారాల పాటు ప్రేక్షకులకు మజాను పంచిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. ఆదివారం సాయంత్రమే ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఆ సారి టైటిల్ కోసం గతంలో మాదిరిగా కాకుండా ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లు బిందు, మిత్రా, అఖిల్, బాబా, అనిల్, ఆరియానా, శివలు పోటీ నిలిచారు.

  Happy Birthday NTR: సినీ చరిత్రలో తారక్‌దే ఆ రికార్డు.. ఆస్తుల విలువ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే!

  చివరి వారంలో ఫుల్ సందడి

  చివరి వారంలో ఫుల్ సందడి


  షో మొదటి నుంచే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫినాలే వీక్ చివరి వారంలో ఉంది. ఇందులో కంటెస్టెంట్లకు టాస్కులు లాంటివి ఏమీ ఇవ్వడం లేదు. అంతేకాదు, అందరికీ సంబంధించిన జర్నీ వీడియోలను చూపించారు. అలాగే, గార్డెన్ ఏరియాలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాటలు కూడా ప్లే చేస్తూ సందడి చేసేస్తున్నారు.

  గ్రాండ్ ఫైనల్.. 2 రౌండ్లుగానే

  గ్రాండ్ ఫైనల్.. 2 రౌండ్లుగానే


  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లు ఉండడంతో దీన్ని రెండు రౌండ్లుగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి దానిలో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి.. మరో రౌండ్‌లో టాప్ 4 మెంబర్లను తీసుకు వెళ్లబోతున్నారు. అంతేకాదు, ఇందులోనే విజేతను కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే కొన్ని వివరాలూ బయటకు వచ్చాయి.

  స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

  తొలి రౌండ్‌లో ముగ్గురు ఔట్

  తొలి రౌండ్‌లో ముగ్గురు ఔట్


  బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలకే సంబంధించిన షూటింగ్ గురువారమే మొదలైనట్లు ఇప్పటికే చెప్పుకున్నాం. ఆరోజు జరిగిన దాంట్లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్లను షో నుంచి ఎలిమినేట్ చేశారని కూడా ఓ న్యూస్ లీకైంది. అందులో ఏడో స్థానంలో నిలిచిన అనిల్ రాథోడ్, ఆరో స్థానంలో ఉన్న బాబా భాస్కర్, ఐదో స్థానంలో నిలిచిన మిత్రా శర్మ బయటకు వెళ్లిపోయారని తెలిసింది.

  ఆ నలుగురు చివరి దశలోకి

  ఆ నలుగురు చివరి దశలోకి

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఏకంగా ఏడుగురు ఫినాలేకు చేరుకున్నారు. అందులో ముగ్గురు కంటెస్టెంట్లు మొదటి రౌండ్‌లోనే ఎలిమినేట్ అవడంతో మిగిలిన నలుగురు తుది పోరుకు వెళ్లారు. అందులో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న బిందు మాధవి, అఖిల్ సార్థక్‌తో పాటు యాంకర్ శివ, ఆరియానా గ్లోరి ఉన్నట్లు తెలిసింది. వీళ్లలో అఖిల్, బిందులో ఒకరు విజేత కాబోతున్నారు.

  హీరోయిన్ బెడ్‌రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!

   ఆరియానా పది లక్షల ఆఫర్

  ఆరియానా పది లక్షల ఆఫర్


  బిగ్ బాస్ నుంచి అందుతోన్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫినాలేలో టాప్ 4లో నిలిచిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ రూ. 10 లక్షలు ఆఫర్ చేశాడట. దీనికి ఆరియానా గ్లోరీ ఒప్పుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈ డబ్బులను తీసుకుని ఆమె టైటిల్ ఫైట్ నుంచి తప్పుకుందని అంటున్నారు. దీంతో యాంకర్ శివ టాప్ 3లోకి చేరుకున్నాడని తెలిసింది.

   షో చరిత్రలో ఇది రెండోసారి

  షో చరిత్రలో ఇది రెండోసారి


  బిగ్ బాస్ షో చరిత్రలో ఫినాలేలో డబ్బులు తీసుకుని తప్పుకున్న కంటెస్టెంట్ల గతంలో ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అది నాలుగో సీజన్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ రియాన్. అతడి తర్వాత అంటే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఆరియానా గ్లోరీ దాన్ని రిపీట్ చేసిందట. దీంతో బిగ్ బాస్ షోలో మనీ ఆఫర్‌కు ఒప్పుకున్న రెండో కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Ariyana Glory Took Rs 10 Lakhs Money in Bigg Boss Non Stop Finale.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X