OTTలోకి వచ్చేసిన లోకేష్ కనగరాజ్ విలన్ కొత్త మూవీ... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాల్లో హీరో ఎంత ఫేమసో విలన్ కూడా అంతే ఫేమస్. ఇక ఆయన సినిమాల్లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్ లో అర్జున్ దాస్ నటిస్తుంటారు. మరి ఆయన హీరోగా తెరకెక్కిన బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది... దాని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాల్లో విలన్ గా కనిపించిన అర్జున్ దాస్ అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన ఈ సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచి నటుడిగా ఆయనకు సౌత్ లో పేరుంది. ఇక అర్జున్ దాస్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఆయన గంభీరమైన గొంతు. అతను చెప్పే డైలాగులకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది.

ఆ విషయం పక్కన పెడితే.. అర్జున్ దాస్ తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ.. క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఇక తెలుగులో ఆయన బుట్టబొమ్మ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అర్జున్ దాస్ కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు అర్జున్ దాస్. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక తమిళలంలో క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, అర్జున్ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అనీతి. దీన్ని తెలుగులో బ్లడ్ చాక్లెట్‌గా డబ్ చేశారు. షాపింగ్ మాల్, అరవన్, జైల్ సినిమాలతో ఫీల్ గుడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వసంత్ బాలన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దుషారా విజయన్, వనితా విజయ్ కుమార్, భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ జులై 21వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రమోషన్స్ లేకపోవడంతో ఓ మోస్తరు వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయితే ఈ బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కు, ధనవంతుల ఇంట్లో పనిచేసే అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ ఇదని తెలుస్తోంది. మనుషుల్ని చంపాలనే ఆలోచనలతో కూడిన మానసిక సమస్యలతో బాధపడే యువకుడి పాత్రలో అర్జున్ దాస్ జీవించేశాడు.
ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఎప్పటిలాగే వసంత బాలన్ తన డైరెక్షన్ తో ఆకట్టుకున్నారు. సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య ఉండే అంతరాలను ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో చూపించారాయన. మీరు కనుక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











