సైలెంట్‌గా ఓటీటీలోకి అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కళ్యాణ్‌రామ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బింబిసారతో హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్‌రామ్ .. డెవిల్, అమిగోస్ సినిమాలు ఫట్ అయ్యాయి. ఖచ్చితంగా హిట్ సాధించాల్సిన దశలో కళ్యాణ్‌రామ్ నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఓటీటీ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్‌తో కళ్యాణ్‌రామ్ మూవీ
ఎన్టీఆర్ ఆర్ట్స్ , అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్ ముప్పాలు సంయుక్తంగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని నిర్మించారు. సయీ మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, శ్రీకాంత్, సొహైల్ ఖాన్, బాబ్లూ పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులతో కలిపి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను దాదాపు రూ.45 కోట్ల మేర బడ్జెట్‌తో తెరకెక్కించారు.

కళ్యాణ్‌రామ్ మూవీపై భారీ అంచనాలు
కళ్యాణ్‌రామ్‌తో కలిసి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటిస్తుండటం.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి అనుగుణంగానే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజెనెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలలో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు 4 కోట్ల రూపాయల చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల మేర వ్యాపారం జరిగింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం లాభాల్లోకి రావాలంటే.. 25 కోట్ల రూపాయల షేర్, రూ.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని విలువ కట్టారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
30 కోట్ల నష్టాలతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి
ఈ సినిమాకు తొలి రోజున రూ.3.4 కోట్లు , 2వ రోజున రూ.1.95 కోట్లు, 3వ రోజున రూ.2.1 కోట్లు, 4వ రోజున రూ.0.97 లక్షలు, 5వ రోజున రూ.78 లక్షలు, 6వ రోజున రూ.74 లక్షలు 7వ రోజున రూ.57 లక్షలు, 8వ రోజున రూ.39 లక్షలు, 9వ రోజున రూ.35 లక్షల నికర వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. థియేట్రికల్ రన్ ముగిసే నాటికి అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఇండియా వైడ్ రూ.8.7 కోట్ల నెట్, రూ.11.33 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఓవర్సీస్ కలెక్షన్స్ కోటి రూపాయలు + ఇండియాలో వచ్చిన గ్రాస్ వసూళ్లు కలిపి అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12.33 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో దాదాపు 30 కోట్ల నష్టంతో ఈ సినిమా బిజినెస్ క్లోజ్ చేసింది. అయితే ఓటీటీ రైట్స్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్‌తో నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా.
సైలెంట్‌గా ఓటీటీలోకి కళ్యాణ్‌రామ్ మూవీ
థియేటర్‌లో ఫెయిలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఏప్రిల్ చివరినాటికే ఓటీటీలోకి వస్తుందని సినీ జనాలు భావించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి థియేటర్‌లో అంచనాలను అందుకోలేకపోయిన కళ్యాణ్‌రామ్ మూవీ ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











