రెండో భార్యను కెలికిన కంటెస్టెంట్.. మొదటి భార్య చిచ్చుతో చెంపదెబ్బ కొట్టిన భర్త! బిగ్‌బాస్‌లో రచ్చ!
బిగ్ బాస్ హిందీ ఓటీటీ ఇటీవల ప్రారంభమై వివాదాస్పద అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. తాజా 3 సీజన్‌లో ఇద్దరు భార్యలతో యూట్యూబర్ అర్మాన్ ఖాన్ ప్రవేశించడం ఓ సంచలనంగానే చెప్పుకోవాలి. అయితే ఇద్దరు భార్యలతో ఆయన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారి చుట్టే షో కొనసాగుతున్నది. అయితే రీసెంట్ ఎపిసోడ్‌లో మొదటి భార్య పెట్టిన చిచ్చుకు పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ కారణంగా ఇద్దరు కంటెస్టెంట్లు కొట్టుకోవడం మరింత చర్చకు దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..
గత ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు విశాల్ పాండే, లవ్‌కేష్ కటారియా ఇద్దరు ముచ్చట పెడుతూ.. అర్మాన్ రెండో భార్యను ఉద్దేశించి.. కృతికా వదినను చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని విశాల్ అన్నాడు. దాంతో నీవు పరాయి స్త్రీపై అలా మాట్లాడకు. నీవు ఓ తల్లి, భార్య గురించి మాట్లాడుతున్నావు. మహిళలను గౌరవించాలి అని లవ్‌కేశ్ అన్నాడు.

అయితే వీకెంట్ వార్ ఎపిసోడ్‌లో ఆ వీడియోను హోస్ట్ అనిల్ కపూర్ చూపిస్తూ.. అలా మాట్లాడటం తప్పు కదా అంటూ విశాల్‌ను ప్రశ్నించారు. అలా మాట్లాడటం తప్పే అని పాయల్, అర్మాన్ అని అన్నారు. ఆ తర్వాత లవ్‌కేశ్‌ను అడుగుతూ.. కృతిక వదిన నాకు చాలా ఇష్టమని చెప్పడం కరెక్టేనా అని అడిగాడు. దాంతో నా ఉద్దేశం అది కాదు అంటూ విశాల్ వివరణ ఇవ్వబోయాడు.
అయితే విశాల్ తప్పుగా మాట్లాడారు. కాబట్టే లవ్‌కేశ్ చెవిలో కృతిక గురించి ఏదో గుసగుసలాడాడు అని అర్మాన్ మొదటి భార్య అంది. ఆ తర్వాత విశాల్ వద్దకు అర్మాన్ నేరుగా వెళ్లి.. ఆ విషయం గురించి నిలదీశాడు. లవ్‌కేష్‌ను పిలిచి ఏమన్నాడో చెప్పమని అడిగాడు.
అర్మాన్ కోరిక మేరకు విశాల్ చెప్పిన మాటలు.. నాకు కృతిక వదిన అంటే చాలా ఇష్టం అని అన్నాడు అని లవ్‌కేశ్ చెప్పాడు. దాంతో అలా ఎలా అంటావు అని అర్మాన్ నిలదీశాడు. దాంతో వారి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ పెరిగి సహనం కోల్పోయిన అర్మాన్.. విశాల్‌ను చెంపపై పెడేల్‌మని ఒకటిచ్చారు. దాంతో విశాల్‌కు ఏం జరిగిందో అర్దం కాలేదు.
అర్మాన్ కొట్టిన దెబ్బకు విశాల్ గట్టిగా అరిచి పెడబొబ్బలు పెట్టాడు. ఆ తర్వాత అర్మాన్‌పై కలియబడ్డాడు. కొట్టుకోవడానికి పరుగులు పెట్టారు. దాంతో మిగితా కంటెస్టెంట్లు వారిని విడదీసి.. గొడవ చల్లారేలా ప్రయత్నించారు. ఈ ఘటన బుల్లితెర షోపై అత్యంత వివాదాస్పదంగా మారింది.


Click it and Unblock the Notifications











