మీ ఇంటికి వచ్చేస్తున్న దెయ్యం.. ఒంటరిగా చూస్తే అంతే.. అసలు ఎక్కడ చూడాలంటే!
సాధారణంగా ఎన్నో జోనర్లలో సినిమాలు రూపొందుతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో హర్రర్ జానర్ ఒకటి. ఈ తరహాలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. కానీ భయాన్ని కలిగించడంలో విఫలమై పరాజయం పాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన చిత్రమే 'డిమోంటే కాలనీ 2' (Demonte Colony 2).
అరుల్‌నిథి హీరోగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన హర్రర్ సినిమానే 'డిమోంటే కాలనీ 2'. 2015లో తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'డిమోంటే కాలనీ' సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందింది. దీంతో ఈ మూవీపై అంచనాలు ఆరంభం నుంచే భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఆగస్టు 15వ తేదీన తమిళంలో రిలీజ్ చేశారు.

థ్రిల్‌కు గురి చేస్తూ భయపెట్టే స్టోరీతో రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది భారీ స్థాయిలో వసూళ్లను సాధించి హిట్ అయింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఒక వారం తర్వాత అంటే ఆగస్టు 23వ తేదీన తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఇది మంచి టాక్‌ను తెచ్చుకుని అలరించింది.
హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'డిమోంటే కాలనీ 2' సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడడంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు భారీ మొత్తాన్నే ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది.

అరుల్‌నిథి హీరోగా చేసిన 'డిమోంటే కాలనీ 2' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీన్ని సెప్టెంబర్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వణికించే కథతో తెరకెక్కిన 'డిమోంటే కాలనీ 2' సినిమాను BTG యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్ఞానముత్తు, బాబీ బాలచంద్రన్ నిర్మించారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, అర్చన రవిచంద్రన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్ పాండియన్ కీలక పాత్రలను పోషించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











