Demonte Colony 2: ఒంటరిగా చూస్తే సుస్సు పోయించే సినిమా.. ఏ ఓటీటీలో, ఎప్పుడు వస్తుందంటే!

ఇండియాలోని అన్ని భాషల్లోనూ ఒళ్లు గగుర్పాడుకు గురి చేసే హర్రర్ సినిమాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకులు కూడా మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో మరింత కొత్త కాన్సెప్టులతో భయంకరమైన చిత్రాలను రూపొందిస్తున్నారు. అలా ఇటీవలే తమిళంలో విడుదలైన సినిమానే 'డిమోంటే కాలనీ 2' (Demonte Colony 2).

అరుల్‌నిథి హీరోగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన సినిమానే 'డిమోంటే కాలనీ 2'. 2015లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'డిమోంటే కాలనీ' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు ఆరంభం నుంచే భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఆగస్టు 15వ తేదీన తమిళంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Arulnithi Starrer Demonte Colony 2 Movie Streaming On ZEE5 After 4 Weeks

వణుకు పుట్టించే హర్రర్ స్టోరీతో రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఇది అదిరిపోయే వసూళ్లను సాధించి సక్సెస్ సాధించింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఒక వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 23వ తేదీన తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఇది పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని సత్తా చాటుకుంటోంది.

ఒంటరిగా చూస్తే సుస్సు పోయించే కాన్సెప్టుతో రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది.

Arulnithi Starrer Demonte Colony 2 Movie Streaming On ZEE5 After 4 Weeks

అరుల్‌నిథి హీరోగా నటించిన 'డిమోంటే కాలనీ 2' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే అంటే ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‌కు రాబోతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. హర్రర్ స్టోరీతో రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాను BTG యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై జ్ఞానముత్తు, బాబీ బాలచంద్రన్ నిర్మించారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, అర్చన రవిచంద్రన్‌, త్సెరింగ్ దోర్జీ, అరుణ్ పాండియన్ కీలక పాత్రలను పోషించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X