ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమా.. అసలు దీన్ని ఎప్పుడు చూడాలంటే!
హర్రర్ సినిమాలు అన్నీ ఒకే రకమైన రెస్పాన్స్‌ను అందుకుంటాయన్న పరిస్థితులు ఉండవు. దీనికి కారణం డిఫరెంట్ కాన్సెప్టులు, జనాలను భయపెట్టే కంటెంట్ మూవీలు ఇప్పుడు చాలా వరకూ తగ్గిపోయాయి. అయినా కొందరు ప్రయోగాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. అలా ఇటీవలే వచ్చిన క్రేజీ హర్రర్ సినిమానే 'డిమోంటే కాలనీ 2' (Demonte Colony 2).
అరుల్‌నిథి హీరోగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రమే 'డిమోంటే కాలనీ 2'. 2015లో తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'డిమోంటే కాలనీ' సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందింది. దీంతో ఈ మూవీపై అంచనాలు ఆరంభం నుంచే భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఆగస్టు 15వ తేదీన తమిళంలో వైభవంగా విడుదల చేశారు.

వెన్నులో వణుకు పుట్టించే స్టోరీతో రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఇది అదిరిపోయే వసూళ్లను సాధించి హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఒక వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 23వ తేదీన తెలుగులో డబ్ చేశారు. ఇక్కడ కూడా ఇది పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని సత్తా చాటింది.
అదిరిపోయే సీక్వెల్‌గా రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడడంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు ఊహించని రీతిలో డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు భారీ మొత్తాన్నే ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అరుల్‌నిథి హీరోగా చేసిన 'డిమోంటే కాలనీ 2' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చాలా రకాల వార్తలే వైరల్ అవుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని సెప్టెంబర్ 27వ తేదీ నుంచి జీ5 సంస్థ స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. అయితే, తమిళంలో తప్ప మిగిలిన భాషల్లోనే ముందుగా స్ట్రీమింగ్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. భయపెట్టే కథతో రూపొందిన 'డిమోంటే కాలనీ 2' సినిమాను BTG యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్ఞానముత్తు, బాబీ బాలచంద్రన్ నిర్మించారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, అర్చన రవిచంద్రన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్ పాండియన్ కీలక పాత్రలను పోషించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











