OTTలో వణుకు పుట్టిస్తున్నమరో హార్రర్‌ థ్రిల్లర్‌ .. చూడాలంటే డేర్ ఉండాల్సిందే!

ప్రతివారం ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు సందడి చేస్తూ ఉంటాయి. ఇక ఈ వారం వచ్చిన ఓటీటీ సినిమాల్లో ది విలేజ్ హార్రర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయింది. తొలిసారిగా తమిళ హీరో ఆర్య.. ఈ వెబ్ సిరీసులో నటించాడు. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి వణుకు పుట్టిస్తుంది. అసలు ఈ సినిమా కథేంటి.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సినిమా ప్రేక్షకుల కోసం.. ఓటీటీ సంస్థలు కొత్త వెబ్ సిరీసులు, సినిమాలు తీసుుకవస్తున్నాయి. మరీ ముఖ్యంగా హార్రర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సిరీసులు వంటివి తీసుకువచ్చి.. సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. గత నెలలో వచ్చిన అతిథి, మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీసులు ఓటీటీ లవర్స్ ను బాగా అలరించాయి. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ ఓటీటీలో సందడి చేస్తుంది. ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.

 Arya Debut Web Series The Village Horror Thriller Now Streaming on Amazon Prime Video OTT Full Details Here

కోలీవుడ్ స్టార్‌ హీరో ఆర్య తొలిసారిగా నటించిన ది విలేజ్‌ వెబ్ సిరీస్ ఓటీటీలో డైరెక్టుగా రిలీజ్ అయింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ది విలేజ్ టీజర్‌, ట్రైలర్లు ప్రేక్షుకలను విపరీతంగా భయపెట్టాయి. ఇక ఈ సిరీస్ ఈ వారం నవంబర్‌ 24 అర్ధరాత్రి ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ది విలేజ్ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

ది విలేజ్ సిరీసుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సీరిసును షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా డైరెక్టర్‌ మిళింద్‌ రావు రూపొందించారు. బీఎస్ రాధాకృష్ణన్ స్టూడియో శక్తి బ్యానర్‌ పై ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో ఆర్య సరసన దివ్య పిళ్లై నటించింది. ఆడుకులం నరేన్, ఆజియా, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, తలైవాసల్ విజయ్, అర్జున్ చిదంబరం, పూజ, జయ ప్రకాష్, పి.ఎన్ సన్నీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ది విలేజ్‌ కథ విషయానికి వస్తే.. హీరో ఆర్యతో పాటు అతని కుటుంబ సభ్యులు ఓ అడవిలో చిక్కుకుంటారు. అయితే పక్కన ఉండే విలేజ్ కు వాళ్లు వెళ్తారు. ఇక అక్కడే వారికి కొంత మంది తారసపడుతారు. కొన్నిఅతింద్రీయ శక్తులు హీరో భార్య పిల్లలను కిడ్నాప్ చేస్తాయి. మరి వారి నుంచి హీరో తన కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకున్నాడనేదే కథ? ఇక ఈ వెబ్ సిరీస్ విడుదల అయిన తొలిరోజే మంచి స్పందన వస్తుంది.

 Arya Debut Web Series The Village Horror Thriller Now Streaming on Amazon Prime Video OTT Full Details Here

ఈ సిరీస్ భయపెడుతుందంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీకెండ్ ఇలాంటి వెబ్ సిరీస్ చూసి థ్రిల్ అవ్వొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కనుక ఓ మంచి థ్రిల్లర్ హార్రర్ ఫీల్ కలగాలంటే.. ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X