సైలెంటుగా OTTలోకి ఆషికా రంగనాథ్ మెడికల్ థ్రిల్లర్.. భయానికే భయం పుట్టించే దీన్ని ఎలా చూడాలంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు... అనేక కొత్త కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పి కొన్ని సినిమాలు, ఎలాంటి ముందుస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా మరికొన్ని చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీలో అనేక హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు మరో క్రేజీ మెడికల్ థ్రిల్లర్ సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నా సామిరంగా సినిమాలో అక్కినేని నాగార్జున సరసన వరాలుగా కనిపించి మెప్పించిన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా వచ్చిన రీసెంట్ మెడికల్ థ్రిల్లర్ మూవీయే O2. ఈ సినిమాకు రాఘవ్ నాయక్, ప్రశాంత్ రాజ్ లు దర్శకత్వం వహించారు. అలాగే PRK ప్రొడక్షన్స్ క్రింద అశ్విని పునీత్ రాజ్ కుమార్ నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి వివాన్ రాధాకృష్ణ సంగీతం అందించగా.. నవీన్ కుమార్ సినిమాటోగ్రఫర్ గా బాధ్యతలు నిర్వహించారు.

శ్రద్ధగా ఆషికా రంగనాథ్ నటించగా.. ఆమెతో పాటు ప్రవీణ్ తేజ్, రాఘవ్ నాయక్, ప్రకాష్ బెలవాడి, శ్రీధర్, పునీత్ బీఏ, సిరి రవికుమార్, మోహన్, అరుణా బాల్ రాజ్, శరణ్య, సుమారావులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రన్ టైమ్ 109 నిమిషాలుగా ఉంది. అలాగే ఏప్రిల్ 19వ తేదీన ఈ క్రేజీ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కేవలం కన్నడ భాషలో మాత్రమే వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేసిన మెడికల్ థ్రిల్లర్ 02 ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇలా సైలెంటుగా ఓటీటీలోకి వచ్చి తెగ సందడి చేసిన ఈ సినిమాను మీరు కూడా ఓసారి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.



Click it and Unblock the Notifications











