నెల కాకుండానే ఓటీటీలోకి లవ్ మీ.. ఎందులో, ఎప్పుడు వస్తుందంటే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినీ ప్రియుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే కొత్త కొత్త సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అందులోనూ హర్రర్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలకు మరింత ఎక్కువ స్పందన లభిస్తోంది. దీంతో ఎన్నో సినిమాలు రూపొందుతోన్నాయి. అలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిందే 'లవ్ మీ' మూవీ.
దిల్ రాజు ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన ఆశీష్ హీరోగా నటించిన డిఫరెంట్ హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ చిత్రం మే 25వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

డార్క్ హర్రర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'లవ్ మీ' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇది ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ను రాబట్టడం లేదు. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే రన్‌ను ముగించే దిశగా వెళ్తోంది. అదే జరిగితే మూవీ ఫ్లాప్ అవుతుంది.
డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇది భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై న్యూస్ లీకైంది.
ఆశీష్ నటించిన 'లవ్ మీ' సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కాకపోవడంతో దీన్ని నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని జూన్ 22వ తేదీ నుంచి ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై మరికొద్ది రోజుల్లో ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. కిరణ్ భీమవరం దర్శకత్వంలో ఆశీష్ నటించిన 'లవ్ మీ' మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











