మారిపోయిన లవ్ మీ ఓటీటీ ప్లాట్‌ఫాం.. ఈ దెయ్యం సినిమా ఎందులో వస్తుందంటే!
టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది సినీ వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే విజయాన్ని అందుకుని సత్తా చాటారు. కానీ, మిగిలిన వాళ్లు మాత్రం సక్సెస్ కోసం పాటుపడుతున్నారు. అలాంటి వారిలో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశీష్ ఒకడు. అతడు నటించిన మరో సినిమానే 'లవ్ మీ' (Love Me).
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి పరిచయమైన ఆశీష్ నటించిన లేటెస్ట్ మూవీనే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ హర్రర్ అండ్ లవ్ స్టోరీ మూవీ మే 25వ తేదీన గ్రాండ్‌గా విడుదలైంది.

హర్రర్ లవ్ స్టోరీతో విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిన 'లవ్ మీ' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇది ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకోలేదు. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా పడిపోయింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ప్రదర్శనను ముగించుకుని పరాజయాన్ని చవి చూసింది.
ఆశీష్ హీరోగా చేసిన 'లవ్ మీ' సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు అన్నీ బాగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహా సంస్థ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం దీన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఆశీష్ - వైష్ణవి చైతన్య జోడీగా చేసిన 'లవ్ మీ' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే, ఇది డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని జూన్ 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తుందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. ఆశీష్ హీరోగా కిరణ్ భీమవరం దర్శకత్వంలో వచ్చిన 'లవ్ మీ' మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











