సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన దెయ్యం.. భయపెట్టే ఈ మూవీ ఎందులో వచ్చిందంటే!

దేశ వ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నా.. తెలుగులోనే ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలు చాలా వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం మూవీలకు ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. దీంతో అదే తరహాలో మరిన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అలా ఇటీవలే వచ్చిన మరో హర్రర్ సినిమానే 'లవ్ మీ' (Love Me).

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన ఆశీష్ హీరోగా నటించిన తాజా హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం రూపొందించిన ఈ థ్రిల్లర్ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ మూవీ మే 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Streaming Started on Amazon Prime

దెయ్యాన్ని ప్రేమించడం అనే కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఇది రెస్పాన్స్‌ను అందుకోలేక ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకోలేదు. అయితే, ఆ తర్వాత కూడా ఈ సినిమా క్రమంగా డౌన్ అయిపోయింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ప్రదర్శనను ముగించుకుని నష్టాలను మూటగట్టుకుంది.

ఆశీష్ హీరోగా నటించిన 'లవ్ మీ' సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు అన్నీ బాగా శ్రమించాయి. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా వదిలింది. కానీ, డేట్‌ను మాత్రం సదరు సంస్థ రివీల్ చేయలేదు.

Ashish and Vaishnavi Chaitanya Starrer Love Me Movie Streaming Started on Amazon Prime

ఆశీష్ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'లవ్ మీ' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ డేట్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకుండానే గత అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓటీటీలో అద్భుతమైన స్పందన కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది ఇంకెలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉండగా.. కిరణ్ భీమవరం దర్శకత్వంలో ఆశీష్ హీరోగా నటించిన 'లవ్ మీ' మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X