OTT: వాలెంటైన్స్ డే గిఫ్ట్.. ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ

ప్రేమికుల రోజు సందర్భంగా ఓటీటీలోకి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ వచ్చేసింది. యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌, కలర్‌ ఫొటో ఫేమ్‌ చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సబా నాయగన్‌. ఇదే మూవీలో మేఘా ఆకాశ్, కార్తీక మురళీ ధరన్‌ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథేంటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలో కూడా స్పెషల్ మూవీస్ ను అడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు విడుదల అయిన చిత్రం సబా నాయగన్‌. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌, కలర్‌ ఫొటో ఫేమ్‌ చాందినీ చౌదరి, మేఘా ఆకాశ్, కార్తీక మురళీ ధరన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ జానర్లో తెరకెక్కింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఓటీటీలోకి వచ్చేసింది.

Ashok Selvan Chandini Chowdary Sabanayagan Movie Streaming Now on Disney Plus Hotstar OTT Valentines Day Special

హీరో ప్రభాస్ నటించిన సలార్‌ సినిమాకు పోటీగా డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదలైంది సబానాయగన్. ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచింది. డిఫ‌రెంట్ టైమ్ పీరియ‌డ్స్‌లో సాగే ఈ ప్రేమకథకు ఆడియెన్స్‌ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక అశోక్‌ సెల్వన్‌, చాందినీ చౌదరి, మేఘా ఆకాశ్‌ల స్క్రీన్‌ ప్రజెన్స్, యాక్టింగ్‌ సినిమాకు హైలెటుగా నిలిచాయనే చెప్పాలి.

సబా నాయగన్ మూవీ అతి తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కింది. ఈ బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టగలిగింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన సబా నాయగన్‌ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సబానాయగన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.

Ashok Selvan Chandini Chowdary Sabanayagan Movie Streaming Now on Disney Plus Hotstar OTT Valentines Day Special

ఈ నేపథ్యంలో వాలంటైన్స్‌ డే కానుకగా బుధవారం ఫిబ్రవరి 14 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సభా నాయగన్ త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ అందమైన ప్రేమ కథను మీ పార్టనర్ తో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇక స‌బా నాయ‌గ‌న్ సినిమా క‌థ విషయానికి వస్తే... తాగిన మ‌త్తులో స‌బా (అశోక్ సెల్వ‌న్‌) అనే యువ‌కుడు రచ్చ చేస్తాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ల‌వ్ ఫెయిల్యూర్‌ తోనే స‌బా పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తించాడ‌ని పోలీస్ ఆఫీస‌ర్ అర్థం చేసుకుని అతని లవ్‌ స్టోరీ గురించి అడుగుతాడు. అప్పుడు స‌బా తన జీవితంలోకి వ‌చ్చిన రియా, మేఘ‌, దీప్తిల గురించి ఏం చెప్పాడు.. ఈ ముగ్గురిలో స‌బా ఎవ‌రిని ప్రేమించాడన్న‌దే ఈ సినిమా కథ. వేలంటైన్స్‌ డే రోజున ఓ మంచి రొమాంటిక్ లవ్‌ స్టోరీ చూడాలనుకునేవారికి సబా నాయగన్ ఓ మంచి ఛాయిస్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X