OTTలోకి ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ... ఎందులో చూడాలంటే?
ప్రేక్షకులను అలరించేందుకు ప్రతి వారం ఓటీటీలోకి సరి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పండగలతో పాటు ఇతర ప్రత్యేకమైన రోజుల్లో అయితే మరింత స్పెషల్‌గా ఉండే మూవీస్‌ను రిలీజ్ చేస్తుంటాయి. అలా ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు, థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొద్ది రోజుల్లో ప్రేమికుల దినోత్సవం(వాలంటైన్స్ డే) రాబోతుంది. మరి ఆ రోజు స్పెషల్‌గా ఉండాలి కదా.. అందుకే ప్రేమికుల కోసం సరికొత్త సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?
'భద్రమ్', 'మన్మధ లీల', 'పోర్ తొళిల్', 'పిజ్జా 2' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అశోక్ సెల్వన్. ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ అయితే ఇక్కడి ఆడియెన్స్‌ను బాగానే అలరించాయి. దీంతో అశోక్ సెల్వన్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు మంచిగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడాయన నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీనే 'సబా నాయగన్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు. వీరిలో మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్‌తో పాటు కలర్ ఫొటో ఫేమ్ చాందినీ చౌదరి కూడా ఉంది. ఇంకా మైఖేల్ తంగదురై, మైల్ సామి, అరుణ్ కుమార్, ఉడమలై రవి, జైశీలన్ శివరామ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సీఎస్ కార్తికేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతకుముందు ఆయన విశ్వరూపం, విశ్వరూపం 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక ఈ చిత్రాన్ని క్లియర్ వాటర్ ఫిల్మ్స్, మెగా ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించాయి.
అయితే ఇప్పుడీ సబా నాయగన్ సినిమానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సింది. కానీ ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే స్పెషల్‌గా ఉంటుందని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అందుకే వాయిదా వేసి మరీ ప్రేమికుల దినోత్సవం రోజు విడుదల చేయనున్నారు.

కథేంటంటే ? సబా నాయగన్ ఒక న్యూ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. మూడు దశల్లో ముగ్గురు యువతులతో హీరో సాగించిన లవ్ ట్రాక్, రొమాన్సే ఈ కథ అని తెలుస్తోంది. చిత్రంలో సబా (అశోక్ సెల్వన్) బాగా తాగి పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసి అరెస్ట్ అవుతాడు. ఈ క్రమంలోనే హార్ట్ బ్రేక్ అయిన మరో ఖైదీతో సబా చెప్పే లవ్ స్టోరీసే ఈ సినిమా


Click it and Unblock the Notifications











