For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైన్ తాగుతూ రెచ్చిపోయిన బిగ్ బాస్ భామలు: వాళ్లతో అతడు కూడా.. షాకిస్తోన్న వీడియో

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలవడంతో పాటు రికార్డులను తిరగరాసిన ఏకైక షో బిగ్ బాస్. మరీ ముఖ్యంగా దేశంలోనే ఏ షోకూ రాని రేటింగ్‌ను అందుకుని నెంబర్ వన్ స్థానాన్ని కూడా అందుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను అంతే ఉత్సాహంతో నడిపారు. అందుకు అనుగుణంగానే ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఇందులో కంటెస్టెంట్లుగా వచ్చిన ముగ్గురు సెలెబ్రిటీలు.. తాజాగా వైన్ తాగుతూ నానా రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  లేడీ విన్నర్.. చరిత్ర సృష్టించి

  లేడీ విన్నర్.. చరిత్ర సృష్టించి

  బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకూ ఐదు రెగ్యూలర్ సీజన్లు జరిగాయి. ఇందులో మొత్తం మేల్ కంటెస్టెంట్లే విజయం సాధించారు. అయితే, ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం మహిళా కంటెస్టెంట్ బిందు మాధవి గెలుపొందింది. తద్వారా షో చరిత్రలో రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ సీజన్‌ కూడా సూపర్ హిట్ అయింది.

  యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ బోల్డుగానే

  బిగ్ బాస్ నాన్ స్టాప్ బోల్డుగానే


  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో బోల్డుగా సాగింది. దీనికి కారణం ఇది ఓటీటీలో ప్రసారం కావడమే అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో బోల్డు బ్యూటీలుగా పేరొందిన చాలా మంది లేడీ సెలెబ్రిటీలను తీసుకుని వచ్చారు. దీంతో నాన్ స్టాప్ సీజన్‌లో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల మసాలా సీన్స్ కనిపించాయి.

  నాన్ స్టాప్ సీజన్‌లో ముగ్గురు

  నాన్ స్టాప్ సీజన్‌లో ముగ్గురు

  బిగ్ బాస్ షోలో సాధారణంగా కొందరు గ్యాంగ్‌లుగా మారుతుంటారు. దీంతో వీళ్ల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో అఖిల్ గ్యాంగ్, బిందు మాధవి వర్గం కనిపించింది. దీంతో వీళ్ల మధ్య తరచూ తగాదాలు జరుగుతూ ఉండేవి. ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో అఖిల్ బ్యా‌చ్‌లోని అషు రెడ్డి, అజయ్, స్రవంతిలు బాగా క్లోజ్ అయ్యారు.

  హాట్ షోలో గీత దాటిన సీరియల్ నటి: ఆమెనిలా చూస్తే మతి పోవడం ఖాయం

  బిగ్ బాస్ తర్వాత పార్టీలతో

  బిగ్ బాస్ తర్వాత పార్టీలతో

  బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా చాలా మంది తమ ఫ్రెండ్‌షిప్‌ను కంటిన్యూ చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అజయ్ కుమార్, అషు రెడ్డి, స్రవంతి చోకారపులు చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ వీళ్లు ముగ్గురూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. అలాగే, వెకేషన్లకు వెళ్తున్నారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

  బీచ్‌కు వెళ్లి సందడి చేశారు

  బీచ్‌కు వెళ్లి సందడి చేశారు

  అజయ్ కుమార్, అషు రెడ్డి, స్రవంతి చోకారపులు బిగ్ బాస్ తర్వాత తమ తమ కెరీర్‌లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమయాన్ని మాత్రం కలిసే గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ముగ్గురు స్నేహితులు తాజాగా ఓ బీచ్‌కు వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి తెగ సందడి చేశారు. అషు రెడ్డి, స్రవంతి మాత్రం హాట్ ట్రీట్ ఇచ్చేలా డ్రెస్‌లు వేసుకుని రెచ్చిపోయారు.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన హీరోయిన్: గతంలో చూడని విధంగా అందాల విందు

  వైన్ తాగుతూ రెచ్చిపోయారు

  వెకేషన్‌లో బాగా ఎంజాయ్ చేసిన అజయ్ కుమార్, అషు రెడ్డి, స్రవంతి చోకారపులు ఆయా వీడియోలు, ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఇందులో వీళ్లు ముగ్గురూ కలిసి పోస్ట్ చేసిన ఓ వీడియో అందరికీ షాకిచ్చేలా ఉంది. దీనికి కారణం ఇందులో అషు రెడ్డి, స్రవంతి చోకారపు వైన్ తాగుతూ రచ్చ చేయడమే. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

  వాళ్లిద్దరినీ డీల్ చేయలేదు

  వాళ్లిద్దరినీ డీల్ చేయలేదు


  ఒకవైపు అషు రెడ్డి.. మరోవైపు స్రవంతి చోకారపు తనను ఆటపట్టిస్తుండడంతో అజయ్ కుమార్ తట్టుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా వాళ్లిద్దరూ వైన్ తాగుతూ రచ్చ చేయగా.. అతడు వాళ్లను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేశాడు. మొత్తంగా ఈ వీడియోలో అజయ్ వాళ్లిద్దరి వల్ల ముప్పతిప్పలు పడినట్లు కనిపించాడు. మొత్తానికి ఈ స్నేహితులు యమ హల్‌చల్ చేసినట్లు కనిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Contestants Ashu Reddy, Sravanthi and Ajay Enjoyed in Vacation. This Video Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X