OTTలో రచ్చరేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నాలుగు రోజుల్లోనే ఈ రేంజులో.. చూశారా?
ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఇక వాటి కోసం సినీ లవర్స్.. ప్రతి వారం ఎదురుచూసి చూస్తారు. అయితే ఇటీవల ఓటీటీలోకి వచ్చిన అశ్విన్ బాబు హిండింబ చిత్రం మాత్రం... రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతున్నా... ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ తో దూసుకువెళ్తోంది. సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఆ వివరాల్లోకి వెళితే....
అశ్విన్ బాబు... ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ సోదరుడు. చాలా ఏళ్ల క్రితమే హీరోగా వచ్చిన అశ్విన్.. కొన్ని హిట్లు సాధించినా కానీ... ఎందుకో స్టార్ హీరో కాలేకపోయారు. అయినప్పటికీ.. అన్నయ్య ఓంకార్ సపోర్ట్ తో... తన ప్రయత్నం తాను ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. గతంలో రాజుగారి గది సినిమాతో అలరించిన అశ్విన్... దానికి కంటిన్యూగా 2,3 సినిమాలు కూడా చేశారు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి.

ఇక అశ్విన్ బాబు ఇటీవల 'హిడింబ' అనే యాక్షన్ కం క్రైమ్ థ్రిల్లర్ మూవీని చేశారు. ఈ సినిమాకు అనిల్ కుమార్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ జూలై 20 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లోకి వచ్చింది. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ లభించింది. ఆ తర్వాత మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఫలితంగా ఈ చిత్రం చాలా తక్కువ వసూళ్లనే సాధించింది.

హిడింబ చిత్రంలో అశ్విన్ బాబు హీరోగా చేయగా.. నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం రూ. 3.20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో... హిడింబ దాదాపు కోటి రూపాయల వరకు నష్టాలను చవి చూసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పిటికీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.

ఇక హిడింబ మూవీ... నెలరోజులు కాకముందే.. ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సినిమా హక్కులను సొంతం చేసుకోగా... అనుకున్న సమయం కంటే ముందే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆగస్టు 10వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావడంతో మూవీ లవర్స్ ఈ థ్రిల్లర్ చూడటంలో ఆసక్తి చూపారు. ఇక, ఇందులో సెన్సార్ బోర్డు కట్ చేసిన కొన్ని డైలాగులను, సన్నివేశాలను కూడా యాడ్ చేసి ప్రసారం చేశారు.
ఇక ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో.. ఓటీటీలో కూడా రచ్చరేపుతోంది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో స్ట్రీమింగ్ కి రాగా ఈ మూవీ ఇప్పుడు ఇందులో సెన్సేషనల్ రెస్పాన్స్ ని అయితే అందుకుని దూసుకెళ్తుంది. హిడింబ ఆహాలో ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని అయితే క్లాక్ చేసింది. ఇక ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. వికాస్ బాడిస సంగీతాన్ని అందించారు. మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె కీలక పాత్రలు చేశారు. మీరు గనుక ఇంకా ఈ మూవీని చూడకపోతే.. ఇంకేందుకు ఆలస్యం చూసేయండి.


Click it and Unblock the Notifications











