Hidimbha OTT: ఓటీటీలోకి 'హిడింబ'.. డేట్, టైమ్ ఫిక్స్.. భయపెట్టేందుకు రెడీ.. ఎందులో అంటే?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు ఓంకార్. ఢీ అనే డ్యాన్స్ రియాలిటీ షోతో అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్లో చెరగలేని గుర్తింపు సంపాదించాడు. ఎంతోకాలంలో బుల్లితెర ప్రపంచంపై సత్తా చాటుతున్న ఓంకార్ అతని తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.

2012లో ఓంకార్ దర్శకత్వం వహించిన జీనియస్ సినిమాతో హీరోగా డెబ్యు చేసిన అశ్విన్ బాబు పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే హిడింబ (Hidimbha Movie) అనే మూవీతో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఎక్కడ? ఎప్పటి నుంచి అనే వివరాల్లోకి వెళితే..

Ashwin Babu Nandita Swetha Hidimbha Movie OTT Streaming Date

హీరోగా ఆకట్టుకోలేని: యంగ్ హీరో అశ్విన్ బాబు ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఓంకార్ దర్శకత్వంలోనే వచ్చిన జీనియస్ సినిమాతో సెకండ్ హీరోగా కెరీర్ ప్రారంభించాడు. అనతికాలంలోనే ఎన్నో సినిమాలు చేస్తూ ఆకట్టుకునే పరిచయం అయ్యాడు. అయితే బ్యాచిలర్ ఆఫ్ పిజియోథెరపీ చేసిన అశ్విన్ బాబు హీరోగా మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

Ashwin Babu Nandita Swetha Hidimbha Movie OTT Streaming Date

డిఫరెంట్ మూవీ: జీనియస్ తర్వాత జత కలిసే, రాజు గారి గది, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, రాజు గారి గది 2, రాజు గారి గది 3 సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అశ్విన్ బాబు. వీటిలో రాజు గారు గది పర్వాలేదనిపించుకుంది. తర్వాతి సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇక ఇటీవలే హిండింబ అనే మరో డిఫరెంట్ మూవీతో సందడి చేశాడు ఈ యంగ్ హీరో.

Ashwin Babu Nandita Swetha Hidimbha Movie OTT Streaming Date

వరించని హిట్: జూలై 20న థియేటర్లలో విడుదలైన అశ్విన్ బాబు హిడింబ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా లాజిక్స్, తదితర మైనస్ లతో సినిమాను హిట్ వరించలేకపోయింది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ నందితా శ్వేత హీరోయిన్ గా చేసింది. విఘ్నేష్ కార్తిక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించిన హిడింబ మూవీకి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్టైన్ మెంట్ పతాకంపై అనిల్ సుంకర సమర్పించారు.

Ashwin Babu Nandita Swetha Hidimbha Movie OTT Streaming Date

డేట్ అండ్ టైమ్: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన హిడింబ సినిమా త్వరలో ఓటీటీలోకి (Hidimbha OTT) రానుంది. ఈ విషయంపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. హిడింబ సినిమాను నూరు శాతం తెలుగు ఓటీటీ అయినా ఆహాలో (Aha OTT) ఆగస్టు 10న సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. "హిడింబ వేట మొదలు కాబోతుంది. భయపెట్టే బ్లాక్ బస్టర్ కు సిద్ధంగా ఉండండి" అంటూ ఓటీటీ రిలీజ్ డేట్, టైమ్ ప్రకటించింది ఆహా.

20 రోజుల్లో: జూలై 20న థియేటర్లలో విడుదలైన హిడింబ సినిమా కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. సిటీలో మిస్ అవుతున్న మహిళల కేసును ఛేదించేందుకు పోలీసులు చేసి దర్యాప్తు కథాంశంగా హిడింబ ఉంది. ఇక ఇందులో హీరో హీరోయిన్లతోపాటు శ్రీనివాస రెడ్డి, మకరంద్ దేశ్ పాండే, రాజీవ్ కనకాల, శుభలేక సుధాకర్, రఘు కుంచె, సాహితి అవంచ, సంజయ్ స్వరూప్, విద్యుల్లేఖ రామన్ కీలక పాత్రలు పోషించారు. దీనికి బాడిస వికాస్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X