Hidimbha OTT: నెల కాకముందే ఓటీటీలోకి హిడింబ.. ఆ సీన్స్ కూడా కలిపారు బాసూ!
యాక్టింగ్‌తో పాటు అదిరిపోయే టాలెంట్లు ఉన్నా.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకోలేకపోతోన్న హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అందులో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు ఒకడు. చాలా ఏళ్ల క్రితమే హీరోగా వచ్చిన అతడు.. కొన్ని హిట్లు సాధించినా ఎందుకనో నిలదొక్కుకోలేదు. అయినప్పటికీ ప్రయత్నాలు మాత్రం ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే 'హిడింబ' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చేశాడు. ఇది ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.
టాలెంటెడ్ గాయ్ అశ్విన్ బాబు హీరోగా అనిల్ కుమార్ కన్నెగంటి దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీనే 'హిడింబ'. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఫలితంగా ఈ చిత్రం చాలా తక్కువ వసూళ్లతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. తద్వారా రూ. 3.20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన 'హిడింబ'.. దాదాపు రూ. 1 కోట్లు వరకూ నష్టాలను చవి చూసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన అశ్విన్ బాబు 'హిడింబ' మూవీ.. అనుకున్న సమయానికి కంటే ఓటీటీలోకి వచ్చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా దీన్ని నేటి అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. అంటే.. జూలై 20న విడుదలైన ఈ మూవీ.. నెల కూడా కాకముందే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, ఇందులో సెన్సార్ బోర్డు కట్ చేసిన కొన్ని డైలాగులను, సన్నివేశాలను కూడా యాడ్ చేసి ప్రసారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'హిడింబ' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. వికాస్ బాడిస సంగీతాన్ని అందించారు. మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె కీలక పాత్రలు చేశారు. ఇక, ఓటీటీలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











