ఆ ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్
ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో ఏ ట్రెండ్ ఉంటే అదే తరహాలో సినిమాలు ఎక్కువగా రూపొందుతుంటాయి. అలా ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీలు అన్ని భాషల్లోనూ అధిక స్థాయిలోనే వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో కూడా ఉత్కంఠను రేపే కథలతో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలా ఇటీవల వచ్చిన సినిమానే 'శివం భజే' (Shivam Bhaje).
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రమే 'శివం భజే'. అప్సర్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది ప్రమోషన్ చేసుకుంది. ఇలా ఈ సినిమా ఆగస్టు 1వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

డివోషనల్ అండ్ మిస్టరీ స్టోరీతో రూపొందిన 'శివం భజే' మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే తక్కువగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు నిరాశ పరిచి ఈ సినిమా పరాజయం పాలైంది.
చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడిన అశ్విన్ బాబు నటించిన 'శివం భజే' సినిమాపై హైప్ బాగానే ఉండడంతో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు ఓ రేంజ్‌లో పోటీ ఏర్పడింది. దీంతో ఈ మూవీ రైట్స్‌ను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నాయి. ఈ రైట్స్ కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే ఇచ్చినట్లు ఇప్పటికే సమాచారం లీకైంది.

అశ్విన్ బాబు నటించిన 'శివం భజే' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇది ఆశించిన స్థాయిలో స్పందనను సొంతం చేసుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఊహించని విధంగా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాను గత అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఇందులో మాత్రం ఈ చిత్రం భారీ స్పందనను అందుకుంటున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'శివం భజే' సినిమాను గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇందులో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణిలు కీలక పాత్రలు పోషించారు. వికాస్ బాడిస దీనికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











