ఇండస్ట్రీలో కొత్త జ్యోతిష్కురాలు.. స్టార్ హీరోనే టార్గెట్.. అలాంటి అమ్మాయే కావాలంటూ!

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో జాతకం నమ్మేవారి సంఖ్య ఎక్కువైపోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే పలువురు హీరోయిన్లు తమ టాలెంట్ తో పాటు పూజలు, వ్రతాలను నమ్ముకుంటున్నారు. అందుకోసం ప్రముఖు జ్యోతిష్యులతో పూజలు చేయిస్తున్నారు. అలా ముద్దుగుమ్మలు రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, తాజాగా డింపుల్ హయాతిలు సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామితో పూజలు చేయించిన విషయం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీలోకి కొత్త జ్యోతిష్కురాలు వచ్చిందనే కామెంట్లు వినపడుతున్నాయి.

ఖాన్ త్రయం:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది సల్మాన్ ఖాన్. ఎన్నో ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా, ఖాన్ త్రయంలో ఒకరిగా వెలుగొందుతూ వస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో లవ్ అఫైర్స్ సంగతి పక్కన పెడితే 57 ఏళ్ల వయసు మీద ఉన్న ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. ఆయన పెళ్లిపై ఇప్పటికీ అనేకసార్లు చర్చ కూడా జరిగింది.

Astrologer Bebika Dhurve About Salman Khan Love Betrayal In Bigg Boss OTT 2

ఓటీటీలో:ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఇటీవల 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియాగా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. ఇటీవలే అంటే జూన్ 23న ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా విడుదలైంది. ఇందులో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించగా.. ఆమెకు అన్నయ్యగా వెంకటేష్ నటించారు.

Astrologer Bebika Dhurve About Salman Khan Love Betrayal In Bigg Boss OTT 2

బిగ్ బాస్ ఓటీటీ 2:ప్రస్తుతం టైగర్ 3 సినిమా బిజీగా ఉన్న సల్లూ భాయ్ బిగ్ బాస్ హిందీ ఓటీటీ రెండో సీజన్ కు (Bigg Boss OTT 2) హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జియో సినిమాస్ (Jio Cinemas) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షోలో ప్రముఖ జ్యోతిష్కురాలు బేబీకా ధుర్వే (Bebika Dhurve) ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. ఆమె తాజాగా స్టార్ హీరో సల్మాన్ టార్గెట్ గా అతని జాతకంపై కామెంట్స్ చేసింది.

Astrologer Bebika Dhurve About Salman Khan Love Betrayal In Bigg Boss OTT 2

సేవ చేయడం:బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ ఎప్పుడైన ప్రేమలో మోసపోయారా అని బేబీకా ధుర్వేను మరో కంటెస్టెంట్ మనిషా రాణి అడిగింది. అందుకు బేబీకా ధుర్వే.. "సల్మాన్ ఖాన్ తనను తాను ఎంతో కఠినంగా, ఎలాంటి ఎమోషన్స్ లేని వాడిగా ప్రపంచానికి చూపిస్తాడు. కానీ అతను ఎంతో లోతుగా ప్రేమను చూపించి మృదు స్వభావి. తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇతరుల పట్ల సేవా భావాన్ని చూపించడం చేస్తాడు" అని చెప్పింది.

Astrologer Bebika Dhurve About Salman Khan Love Betrayal In Bigg Boss OTT 2

ఇంటికి పరిమితమై:"తనను బాగా అర్థం చేసుకునే హోమ్లీ వైఫ్ ను సల్మాన్ కోరుకుంటాడు. షూటింగ్ అయిపోయాక సాయంత్ర ఇంటికి వచ్చినప్పుడు రుచికరమైన భోజనం వడ్డించి, తర్వాత ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహాయం చేయాలి. అలా కేవలం ఇంటికి పరిమితమై అతన్ని బాగా చూసుకునే అమ్మాయి మాత్రమే కావాలి" అని బేబీకా చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు "ఇండస్ట్రీలోకి కొత్త జ్యోతిష్కురాలు వచ్చిందిరోయ్" అని అనుకుంటున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X