Main Atal Hoon On OTT ఓటీటీలో అటల్ బీహారి వాజ్‌పేయ్ బయోపిక్.. మై అటల్ హూ ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

నిష్కళంక నేత, మచ్చ లేని రాజకీయ దిగ్గజం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం మై హూ అటల్. జాతీయ అవార్డు గ్రహిత రవి జాదవ్ దర్శకత్వంలో వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్, కమలేష్ భన్సాలీ నిర్మించిన ఈ చిత్రం జనవరి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా థియేుట్రికల్ రన్ ముగించుకొని ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి.. మూవీ బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మై అటల్ హూ సినిమాలో టైటిల్ పాత్రను ప్రతిభావంతుడైన నటుడు పంకజ్ త్రిపాఠి, అటల్ తండ్రిగా పియూష్ మిశ్రా నటించారు. ఎల్‌కే అద్వానీగా రాజా రామేశ్వర్ సేవక్, దీనదయాళ్ ఉపాధ్యాయగా దయా శంకర్ పాండే, శ్యాంప్రసాద్ ముఖర్జీగా ప్రమోద్ పాథక్, ఇందిరాగాంధీగా పాయల్ నాయర్, జయప్రకాశ్ నారాయణ్‌గా ఎక్లాఖ్ ఖాన్, సోనియా గాంధీగా పౌలా మెక్ గ్లీన్ తదితరులు నటించారు.

Atal Bihari Vajpayee s Biopic Main Atal Hoon on OTT Here is the date and OTT Name

మై అటల్ హూ అనే సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా లాభాలను సాధించింది. ప్రస్తుతం ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్దమైంది.

వివాదాలకు, అవాస్తవాలకు, ఎజెండాకు దూరంగా ఉన్న మై అటల్ హూ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకొన్న జీ5 ఓటీటీ సంస్థ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను మార్చి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.

Atal Bihari Vajpayee s Biopic Main Atal Hoon on OTT Here is the date and OTT Name

మై అటల్ హూ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయం తెలియగానే పాజిటివ్‌గా స్పందించారు. ఎట్టకేలకు పంకజ్ త్రిపాఠి అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌ను చూసే అవకాశం లభించబోతున్నది. అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం అందరికి స్పూర్తిదాయకం. అలాంటి బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X