ఓటీటీలో ట్రెండింగ్‌గా టారోట్.. హాలీవుడ్‌లో బ్రహ్మస్త్రం బేబీ సంచలనం!

తెలుగు అమ్మాయి అంతర్జాతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి అవంతిక వందనపు హాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా మారింది. ఆమె వరుస చిత్రాలతో తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం హాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. తెలుగు తేజం అవంతిక వందనపు సినిమా వివరాల్లోకి వెళితే..

అవంతిక వందనపు ఫ్యామిలీ విషయానికి వస్తే..హైదరాబాద్‌కు చెందిన ప్రవాసాంధ్రుల కుటుంబానికి చెందిన వారు. కాలిఫోర్నియాలోని యూనియన్ సిటీలో జన్మించారు. అమెరికన్ కన్సర్వేటరీ థియేటర్‌లో నటనా శిక్షణను పొందారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

Avantika Vandanapu s Tarot trending in Netfilx OTT Here is the details

అవంతిక వందనపు కెరీర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మనమంతా, ప్రేమమ్, రారొండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజాతవాసి చిత్రాల్లో నటించింది. అలాగే భూమిక తమిళం చిత్రంలోను ఆకట్టుకొన్నది.

ఇక హాలీవుడ్‌లో మాక్సీ, సీనియర్ ఇయర్, మీన్స్ గర్ల్స్, టారోట్ చిత్రాల్లో నటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో బాలనటిగా పరిచయమై .. ఇంతింతై వటుడింతైనట్టు హాలీవుడ్ స్థాయికి చేరుకొన్నది. ఇంగ్లీష్ సినిమా పరిశ్రమలో మీన్ గర్ల్స్ చిత్రం అత్యంత గుర్తింపును సాధించారు.

Avantika Vandanapu s Tarot trending in Netfilx OTT Here is the details

మీన్ గర్ల్స్ సినిమా తర్వాత ఆమె నటించిన టారోట్ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత సోని నిర్మించింది. 2024 ఆరంభంలో రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్‌లో మంచి ఆదరణ కూడగట్టుకొన్నది. ఈ చిత్రం జూలైలో 4వ తేదీన ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొంటున్నది.

ఓటీటీలో స్ట్రీమింగ్ టారోట్ చిత్రానికి మంచి వ్యూస్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతున్నది. ఈ క్రమంలో ఆమెకు హాలీవుడ్‌లో ఆఫర్లు పలకరిస్తున్నాయి. అయితే హాలీవుడ్‌ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

More from Filmibeat

Read more about: avantika vandanapu tarot netfilx
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X