Avatar 3 on OTT: ఓటీటీలోకి అవతార్ 3... తెలుగులోనూ అందుబాటులోకి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ ఆయన సినిమాలంటే పడిచచ్చిపోతారు. టైటానిక్ సినిమాతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న కామెరూన్ కొన్నేళ్లపాటు ఎలాంటి సినిమా చేయకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అవతార్ కోసం వర్క్ చేశారు. 2009లో వచ్చిన అవతార్ తొలి భాగం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆయన.. సెల్యూలాయిడ్‌పై విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ఆ రోజుల్లోనే దాదాపు 15 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పాడు జేమ్స్ కామెరూన్.

అవతార్ వచ్చిన 13 ఏళ్ల తర్వాత 2022లో అవతార్ పార్ట్ 2: ది వే ఆఫ్ వాటర్ కూడా భారీ అంచనాల మధ్య రిలీజై.. దాదాపు 18 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా గతేడాది డిసెంబర్‌లో అవతార్: ఫైర్ అండ్ యాష్ విడుదలైంది. అయితే తొలి రెండు భాగాలకు వచ్చినంత రెస్పాన్స్, కలెక్షన్స్ అవతార్ 3కి రాలేదు. సన్నివేశాలు రోటీన్‌గా ఉండటంతో పాటు కథ, కథనాలు కూడా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేశాయి. అయినప్పటికీ అవతార్ సిరీస్‌పై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు పర్లేదనే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా అవతార్ 3 ఓటీటీపై ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ వివరాల్లోకి వెళితే..

Avatar 3 Fire and Ash OTT Release Date Confirmed on Hotstar in Telugu and Other Languages

అవతార్ 3 తారాగణం
గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 19న అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లైట్‌స్ట్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సామ్ వార్తింగ్టన్, జో సాల్దానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జోయెల్ డేవిడ్ మూరే, బ్రెండన్ కోవెల్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి జేమ్స్ కామెరాన్, రిక్ జాఫా, అమందా సిల్వర్‌లు స్క్రీన్ ప్లే, స్టోరీని అందించారు.

అవతార్ 3 బడ్జెట్ ఎంత?
ఈ చిత్రానికి రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. స్టీఫెన్ ఈ రిక్విన్, డేవిడ్ బ్రెన్నెర్, నోకోలస్ డీ టోత్, జాన్ రిఫోవా, జాన్ గౌడియో, జేమ్స్ కామెరాన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సిమోన్ ఫ్రాంగ్లెన్ సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్‌, భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం అవతార్ 3కి భారీగా ఖర్చు పెట్టారు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 3300 కోట్ల రూపాయలు) బడ్జెట్ అయ్యింది.

అవతార్ 3 కలెక్షన్స్
అవతార్ 3 అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అమెరికా, కెనడాలలో 403.9 మిలియన్ డాలర్లు (3794 కోట్ల రూపాయలు), చైనాలో 150 మిలియన్ డాలర్లు (1408 కోట్ల రూపాయలు), ఫ్రాన్స్‌లో 112 మిలియన్ డాలర్లు (1051 కోట్ల రూపాయలు), జర్మనీలో 95.8 మిలియన్ డాలర్లు (899 కోట్ల రూపాయలు), దక్షిణ కొరియాలో 54.2 మిలియన్ డాటర్లు (509 కోట్ల రూపాయలు) చొప్పున వరల్డ్ వైడ్‌గా 1.486 బిలియన్ డాలర్లు (14,219 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

ఇండియాలో అవతార్ 3 కలెక్షన్స్
అవతార్ సిరీస్‌పై క్రేజ్ నేపథ్యంలో ఇండియాలో అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. హిందీలో 66 కోట్ల రూపాయలు, ఇంగ్లీష్‌లో 86 కోట్ల రూపాయలు, తమిళంలో 27 కోట్ల రూపాయలు, తెలుగులో 14 కోట్ల రూపాయలు, కన్నడంతో 52 లక్షల రూపాయలు, మలయాళంలో 23 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేసరికి అవతార్ 3 మూవీకి ఇండియాలో 236 కోట్ల రూపాయల గ్రాస్.. 193 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

అవతార్ 3 ఓటీటీ రిలీజ్
తొలుత ఈ ఏడాది మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలలో అద్దె ప్రాతిపదికన అవతార్ 3: ది ఫైర్ అండ్ యాష్ స్ట్రీమింగ్ అయ్యింది. అమెజాన్‌లో కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా అవతార్ 3ను ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. జూన్ 24 నుంచి ఈ సినిమా హాట్ స్టార్‌లో అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అవతార్ 3 స్ట్రీమింగ్‌ కానుంది. మరి ఓటీటీలో అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more about: avatar 3 james cameron ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X