Avatar 3: Fire and Ash OTT: 13000 కోట్లతో సంచలనం.. అవతార్ 3 ఏ ఓటీటీలో? ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లి, అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించిన అవతార్ మూవీ.. ప్రపంచ సినీ ప్రస్థానంలో ఓ చరిత్ర. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సెల్యూలాయిడ్‌పై తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం అవతార్. అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా గతంలో అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లైట్‌స్ట్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌలు సంయుక్తంగా నిర్మించారు. సామ్ వార్తింగ్టన్, జో సాల్దానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జోయెల్ డేవిడ్ మూరే, బ్రెండన్ కోవెల్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి జేమ్స్ కామెరాన్, రిక్ జాఫా, అమందా సిల్వర్‌లు స్క్రీన్ ప్లే, స్టోరీని అందించారు. ఈ చిత్రానికి రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. స్టీఫెన్ ఈ రిక్విన్, డేవిడ్ బ్రెన్నెర్, నోకోలస్ డీ టోత్, జాన్ రిఫోవా, జాన్ గౌడియో, జేమ్స్ కామెరాన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సిమోన్ ఫ్రాంగ్లెన్ సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా అవతార్ 3 ప్రపంచవ్యాప్తంగా తన థియేట్రికల్ రన్‌ను ముగించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులు ఈ విజవల్ వండర్‌ను ఇంట్లో ఆస్వాదించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అవతార్ 3 ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాల్లోకి వెళితే..

Avatar 3 Fire and Ash OTT Release When And Where To Watch James Cameron s Movie Online After Theatrical Run

అవతార్ 3 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్‌, భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం అవతార్ 3కి భారీగా ఖర్చు పెట్టారు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 3300 కోట్ల రూపాయలు) బడ్జెట్ అయ్యింది.

అవతార్ 3 కలెక్షన్స్
అవతార్ ఫ్రాంచైజీకి ఉన్న ఆదరణ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రపంచ సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే అవతార్ తొలి రెండు భాగాలతో పోలిస్తే అవతార్ 3 అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది. అమెరికా, కెనడాలలో 403.9 మిలియన్ డాలర్లు (3794 కోట్ల రూపాయలు), చైనాలో 150 మిలియన్ డాలర్లు (1408 కోట్ల రూపాయలు), ఫ్రాన్స్‌లో 112 మిలియన్ డాలర్లు (1051 కోట్ల రూపాయలు), జర్మనీలో 95.8 మిలియన్ డాలర్లు (899 కోట్ల రూపాయలు), దక్షిణ కొరియాలో 54.2 మిలియన్ డాటర్లు (509 కోట్ల రూపాయలు) చొప్పున వసూలు చేసింది.

ఇండియాలో అవతార్ 3 కలెక్షన్స్
ఇండియాలో అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. హిందీలో 65.59 కోట్ల రూపాయలు, ఇంగ్లీష్‌లో 86.20 కోట్ల రూపాయలు, తమిళంలో 26.65 కోట్ల రూపాయలు, తెలుగులో 13.51 కోట్ల రూపాయలు, కన్నడంతో 52 లక్షల రూపాయలు, మలయాళంలో 23 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేసరికి అవతార్ 3 మూవీకి ఇండియాలో 235 కోట్ల రూపాయల గ్రాస్.. 192.70 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

అమెరికాకు వెలుపల అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి 9525 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ హిట్ ఫ్రాంచైజీకి 13070 కోట్ల రూపాయలు వసూలైంది. అయితే గతంలో వచ్చిన అవతార్ 1కి వరల్డ్ వైడ్‌గా 13500 నుంచి 14000 కోట్ల రూపాయలు, 18630 నుంచి 19000 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూలు చేసింది. అవతార్ 2 అయితే ఇండియాలో ఏకంగా 484 కోట్ల రూపాయలు రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అవతార్ 3 ఏ ఓటీటీలో
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీ దాదాపు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్‌లో కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇక భారతదేశంలో అవతార్ 3 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఏప్రిల్ లేదా మే నెలల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి తీసుకురానుంది జియో హాట్‌స్టార్. మరి ఓటీటీలో అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X