Modern Masters on OTT: రాజమౌళికి ఓటిటి ఎంట్రీకి ఏకంగా అవతార్ దర్శకుడితో.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రస్తుత జెనరేషన్ లో భారతీయ సినిమాని ప్రపంచ పటంలో ఓ రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే ముక్తకంఠంతో అది ఒక్క ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్తారు అంతా. తన సినిమాలతో తెలుగు సినిమా ఫేట్ ని మార్చేసి రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ దర్శకుడు అయ్యాడు. తన సినిమాల్లో ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా వివరించే తత్వంతో జక్కన్న అనే పేరుని రాజమౌళి సొంతం చేసుకున్నాడు.
కాగా ఇప్పుడు రాజమౌళికి ఉన్న స్థానం ఏంటి అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. అందుకే తనపై ప్రపంచ నెంబర్ 1 స్ట్రీమింగ్ సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సైతం ఒక స్పెషల్ డాక్యుమెంటరీ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చారు. గత కొన్నాళ్ల కితమే రాజమౌళితో డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేయగా ఇప్పుడు దానికి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ ట్రైలర్ తో ఈ డాక్యుమెంటరీ పట్ల అందరిలో మరింత ఉత్సాహం మొదలైంది.

ఇందులో రాజమౌళితో వర్క్ చేసిన పాన్ ఇండియా హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ రామ్ చరణ్ లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టుగా కనిపిస్తున్నారు. రాజమౌళి ఒక మ్యాడ్ మ్యాన్, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు ఎవరైనా ఏమన్నా తేడా చేస్తే సెట్స్ నుంచే గెటౌట్ అంటాడు అంటూ తమ హీరోలు చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చారు. కాగా నెట్ ఫ్లిక్స్ వారు కట్ చేసిన ఈ ట్రైలర్ కట్ కూడా మైండ్ బ్లాకింగ్ గా ఉందని చెప్పాలి.
అసలు రాజమౌళి సినిమా ఎలా చూపించాలి అనుకుంటారు? తన స్టోరీ టెల్లింగ్ ఏ లెవెల్లో ఉంటుంది అనేవి వివరించినట్టుగా చూపించారు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి లపై బాహుబలి 2 షాట్ అయితే మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై గ్లోబల్ సెన్సేషన్ RRR నుంచి పలు విజువల్స్ చూపించారు. అయితే ఇవన్నీ ఒకత్తే అయితే RRR కోసం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఊహించని ఎలిమెంట్ ని డాక్యుమెంటరీలో చూపించడం వావ్ అనిపిస్తుంది.
రాజమౌళి కోసం ఏకంగా హాలీవుడ్ నెంబర్ 1 గ్రాసర్ చిత్రాలు "అవతార్" దర్శకుడు ప్రత్యేకంగా ఈ డాక్యూమెంటరీ కోసం మాట్లాడ్డం షాకింగ్ అని చెప్పాలి. గతంలోనే ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో జేమ్స్ కామెరాన్ ఎంతో ఎగ్జైట్ అవుతూ మాట్లాడారు. ముఖ్యంగా రామ్ చరణ్ రోల్ కోసం మాట్లాడ్డం ఇంటర్నెట్ ని షేక్ చేసింది. అప్పట్లోనే రాజమౌళితో కలిసి వర్క్ చేద్దాం అని కూడా చెప్పారు.
మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు రాజమౌళి డాక్యుమెంటరీలో కనిపించడం ఇండియన్ సినిమాకే గర్వకారణం అని చెప్పాలి. కాగా వీరితో పాటుగా బాలీవుడ్ నిర్మాత రాజమౌళి బాహుబలి 2 తో భారీ లాభాలు అందుకున్న కరణ్ జోహార్ కూడా ఈ ట్రైలర్ లో కనిపిస్తుండగా తనతో పాటుగా రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణితో కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్ ఫ్లిక్స్ వారు రాబట్టనట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో ఆగస్టు 2వ తేదీన రిలీజ్ అవుతున్నది.
కాగా ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఈ ఆగస్ట్ 2వ తేదీ నుంచి అయితే నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న డాక్యుమెంటరీ కేవలం ఒక్క ఎపిసోడ్ గా మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాలి. కాగా ఇప్పుడు రాజమౌళి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహేష్ 29వ సినిమా చేస్తుండగా ఈ సినిమా వరల్డ్ లెవెల్లో రిలీజ్ కానుంది అన్నట్టుగా టాక్.


Click it and Unblock the Notifications











