OTT: ఓటీటీలోకి ఒక్కరోజే 2 సంచలన సినిమాలు.. ఏ మూవీ ఎందులో అంటే?
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాను చూసే విధానంలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు ఉన్న లెక్కలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం సినిమాల్లో కంటెంట్ ఉంటేనే అది చిన్న మూవీ అయినా పెద్ద చిత్రమైనా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. లేకుంటే వాటిని ఓటీటీల్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలను కూడా ఓటీటీల్లో చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు రెండు సంచలన సినిమాలు ఒక్కరోజే ఓటీటీలో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దామా!
హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన అద్భుతమైన రంగుల ప్రపంచం అవతార్. 2009లో విడుదలైన ఈ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. మరోసారి అలాంటి విజువల్ వండర్ అవతార్ 2ను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు, సినీ లవర్స్ బారులు తీరిన విషయం తెలిసిందే. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత దృశ్యాకవ్యం అయినా 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' గతేడాది డిసెంబర్ 16న విడుదలై ఏకంగా 2 బిలియన్ డాలర్లు రాబట్టింది.

అవతార్ 2 మూవీ 4కే అల్ట్రా హెచ్‌డీటీఎం రెజల్యూషన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ట్రాక్ తో విదేశాల్లో ఇప్పటికే డిజిటల్ వరల్డ్ లో ప్రదర్శించబడుతోంది. అయితే అవతార్ 2 సినిమాను డిజిటల్ తెరపై చూడాలనుకున్నవారు మొన్నటివరకు రెంటల్ విధానంలో చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 7 నుంచి ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది
ఇక ఈ మధ్య థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 2018. సుమారు నెల రోజులుగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న వాటిలో మలయాళ సినిమా 2018 ఒకటి. ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా సోనీ లివ్ వేదికగా జూన్ 7 నుంచి మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మాలీవుడ్ పాపులర్ హీరో టోవినో థామస్ నటించిన ఈ సినిమాకు జుడే ఆంథనీ థామస్ దర్శకత్వం వహించారు. 2018లో కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన వరదల నేపథ్యంతో ఈ మూవీ రూపొందింది.


Click it and Unblock the Notifications











