Avatar 2 OTT: అవతార్ 2 ఓటీటీ డేట్ ప్రకటన.. అందులోనే మూవీ స్ట్రీమింగ్
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. హై రేంజ్ విజువల్స్, ఫుల్ లెంగ్త్ టెక్నాలజీ, భారీ బడ్జెట్‌తో ఎంతో ఉన్నతంగా రూపొందే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతుంటుంది. అందుకే ఆ తరహా మూవీలకు కలెక్షన్లు భారీ స్థాయిలో రాబడుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఇండియాలో హాలీవుడ్ చిత్రాలకు ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఇది ఇంగ్లీష్‌తో పాటు ఇండియాలోని చాలా భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.
సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన విజువల్ వండర్ మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది డిసెంబర్ 22వ తేదీన ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ రెండు బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 16423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

క్రేజీ కాన్సెప్టుతో హైబడ్జెట్ పెట్టి రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్ అయింది. దీంతో ఇది వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర యూనిట్ తాజాగా దీనిపై ప్రకటన చేసింది. అందులో ఈ సినిమాను మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందులోనే మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది.


Click it and Unblock the Notifications











