OTTలోకి రాబోతున్న అవికా గోర్ కొత్త వెబ్ సిరీస్.. చూడాలంటే చాలా దమ్ముండాల్సిందే గురూ!
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగు పెట్టిన అవికా గోర్ గురించి దేశప్రజలందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే ఈ ముద్దుగుమ్మ ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ.. మన పక్కింటి అమ్మాయిలా మాట్లాడుతూ నటించి మెప్పించింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, మంజా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, వేగాడు, నెట్, టెన్త్ క్లాస్, థాంక్యూ, పాప్ కార్న్ వంటి అద్భుతమైన చిత్రాలతో అందరినీ అలరించింది.
ఇటీవలే మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా తెలుగు అభిమానుల్ని అలరించింది. అయితే తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే వధువు. అవికా గోర్ తో పాటు నందు, అలీ రెజాలు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణ పోలూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రోమోను ఈరోజే విడుదల చేశారు. అనుక్షణం ఆసక్తి రేకెత్తించేలా సాగిన వధువు వెబ్ సిరీస్ నిజంగా చాలా బాగుంది. ఎవరి అంచనాలకు అందని రీతిలో ట్విస్టులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

వధువు అనే వెబ్ సిరీస్ కు మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనే క్యాప్షన్ పెట్టారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కు విపరీతమైన స్పందన రాగా ఈరోజు వచ్చిన ట్రైలర్ కూడా అధ్బుతంగా ఉంది. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా సరే ఓ పెళ్లి చేయాలంటారు.. కానీ ఈ పెళ్లిలో అన్ని రహస్యాలే అంటూ ట్రైలర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత అవికా గోర్ కిటీకి పక్క నుంచి చూడడం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే తనకోసం పంపిన సారెలో ఓ పనస కాయ ఉండగా.. అందులో ఓ ఆకు పెట్టి కుట్లు వేసి పంపించడం అందరికీ షాకిచ్చింది.
ఆ తర్వాత అవికా గోర్ ఆ ఆకు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అది ఉమ్మెత్త ఆకు అని, అందులో విషం ఉంటుందని ఎవరో ఒకరు చెప్పడం కూడా మనం గుర్తింవచ్చు. ఆ తర్వాత అవికా గోర్ ఉమ్మత్త ఆకు గురించి పూర్తిగా తెలుసుకునేందుకు అనేక పుస్తకాలు చదువుతుంది. ఆ పనసకాయ లోపల పెట్టి కుట్లు వేసిన సూదిని కూడా గుర్తించి అదే పనిగా చూస్తూ కనిపిస్తుంది. అయితే ఇదంతా పొరపాటుగా జరగలేదని.. ఎవరో కావాలనే ఇదంతా చేసినట్లు ఉందని అవికా గోర్ చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగిపోతుంది. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ ను చూడాలంటే కాస్త ధైర్యం ఉండాల్సిందే.

అద్భుతమైన ట్విస్టులతో పాటు అంతకు మించి భయపెడుతున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ వేధికగా అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేదిగా వధువు అనే వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అద్భుతమైన థ్రిల్ ను ఇచ్చే వెబ్ సిరీస్ ను చూసేందుకు రెడీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











