10th Class Diaries ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడంటే?

సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి దర్శకత్వంలో శ్రీరాం, అవికా గోర్ జంటగా నటించిన 10th క్లాస్ డైరీస్ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అచ్యుత్ రామారావు, రవితేజ మాన్యం నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.

ఈ సందర్భంగా నిర్మాత అచ్యుత్ రామారావు మాట్లాడుతూ.. థియేట్రికల్ రిలీజ్ ద్వారా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి ఓటీటీలో రిలీజ్ అయింది. యూత్‌కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి అని అన్నారు. థియేట్రికల్ రిలీజ్ సూపర్ హిట్ టాక్‌ను అందుకొన్నది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది అని అన్నారు.

Avika Gors 10th Class Diaries steaming on Amazon Prime Video

10th క్లాస్ డైరీస్ సినిమా విషయానికి వస్తే.. శ్రీరాం, అవికా గోర్ మధ్య లవ్, రొమాంటిక్ అంశాలు బాగున్నాయి. వారిద్దరి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. శ్రీనివాస రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ మంచి వినోదాన్ని అందించారు. వారి కామెడీ టైమింగ్ అద్బుతంగా ఉంది అని నిర్మాతలు, దర్శకుడు తెలిపారు.

సాంకేతిక విషయాలకు వస్తే.. గరుడవేగ అంజి దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రఫి బాధ్యతలు కూడా నిర్వహించాడు. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సన్నివేశాలను పరుగులుపెట్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X