Dream Girl 2 OTT: మీకోసం మీ ఇంటికి రాబోతున్న డ్రీమ్ గర్ల్2.. రెడీగా ఉండండి బాబులూ!
Dream Girl 2 OTT: 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన తాజా చిత్రం డ్రీమ్ గర్ల్ 2. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం కామెడీ డ్రామాగా రూపొందింది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. రాజ్ శౌండిల్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... అనన్యా పాండే హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమానను ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నేరుగా మీ ఇంట్లోకే రాబోతుంది. అదెలా అనుకుంటున్నారా..?
అదేం లేదండి.. మీ ఇంట్లోకే వస్తుందంటే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైందని అర్థం. నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 20వ తేదీ అంటే రేపటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా చిత్రబృందం వెల్లడిచింది. ఇకపై మీ కలలన్నీ నెరవేరుతాయి... ఎందుకుంటే డ్రీమ్ గర్ల్ రాబోతుంందటూ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఓటీటీ ప్రియులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం... సినిమా చూడాలి అనుకుంటున్నామంటూ రిప్లై ఇస్తున్నారు.

డ్రీమ్ గర్ల్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, అనన్యా పాండేలతో పాటుగా నుష్రత్ భరుచ్చా, అన్నూ కపూర్, మంజోత్ సింగ్, విజయ్ రాజ్, అభిషేక్ బెనర్జీలు కూడా నటించారు. అయితే 2019 మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవగా... అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా కూడా నిలిచింది. ఈక్రమంలో పార్ట్ 2 ను కూడా తీశారు. నాలుగేళ్ల తర్వాత డ్రీమ్ గర్ల్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ మొదటి పార్ట్ హిట్టయినంతగా ఈ సినిమా హిట్టు కాలేకపోయింది. కానీ మంచి స్పందనే వచ్చింది.
ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో కరమ్ వీర్ సింగ్ గా కనిపించాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇతడు.. తండ్రి చేసిన అప్పులతో సతమతం అవుతుంటాడు. ఈక్రమంలోనే తన స్నేహితురాలు పరితో ప్రేమలో పడతాడు. అయితే పరి క్యారెక్టర్ లో అనన్యా పాండే కనిపించింది. వీళ్ల ప్రేమ గురించి తెలుసుకున్న పరి తండ్రి కరమ్ కు ఒక షరతు విధిస్తాడు. పరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆరు నెలల్లోనే 25 లక్షల రూపాయల సంపాధించాలని అంటాడు. అయితే పరితో తన ప్రేమను గెలిపించుకునేందుకు కరమ్ వీర్ సింగ్ ఈ షరతకు ఓకే చెబుతాడు.

అయితే ఆరు నెలల్లోనే కరమ్ వీర్ సింగ్ 25 లక్షల రూపాయలు సంపాధించాడా, ఎలా సంపాధించాడో వివరించారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలను ఎలా ఎదుర్కున్నాడు, అనే ఆసక్తికర అఁశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అద్భుతమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మీరూ ఓసారి చూసేయండి. మీరంటే మీ ఒక్కరే కాదండోయ్.. స్నేహితులో, కుటుంబ సభ్యులతోనే కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











