ఓటీటీలోకి వచ్చిన కొత్త బాహుబలి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి
టాలీవుడ్‌లో ఎన్నో భారీ విజయాలను అందుకున్న సినిమాలు వచ్చాయి. ఇవన్నీ ఎంతో మంది నటీనటులను, దర్శకుల స్థాయిని పెంచాయి. కానీ, కొన్ని చిత్రాలు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రమే 'బాహుబలి'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.
రెబెల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' రెండు భాగాలు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ను చూడడంతో పాటు కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన యానిమేటెడ్ వెర్షన్ సిరీస్‌ను కూడా తెరపైకి తీసుకు రావాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది చాలా కాలంగా లేట్ అవుతూనే ఉంది.

'బాహుబలి' యానిమేటెడ్ వెర్షన్‌ను 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' (Baahubali - Crown of Blood' అనే పేరుతో రూపొందించారు. దీన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని కూడా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భాగస్వామ్యంతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవలే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను సైతం విడుదల చేశారు.
హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యన 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' వెబ్ సిరీస్‌ను మే 17వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే గత అర్ధరాత్రి నుంచి ఈ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే ఇందులో కనిపించింది. అంతలోనే హాట్‌స్టార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేసింది.

'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్లుగా రూపొందింది. దీంతో అన్నీ ఈరోజు నుంచే అందుబాటులోకి వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, మొదటి దాన్ని మాత్రమే ఇప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారు. మిగిలిన ఎపిసోడ్‌లను వారానికి ఒకటి చొప్పున అందుబాటులోకి తెస్తామని హాట్‌స్టార్ తెలిపింది. దీంతో రాజమౌళి టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' సిరీస్‌లో బాహుబలి, భల్లాల దేవుడు ఒక టీమ్‌గా, కట్టప్ప వీళ్లకు విలన్‌గా చేసినట్లు ఇటీవలే వచ్చిన ట్రైలర్‌లో చూపించారు. పూర్తిగా కొత్త కంటెంట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











