Baahubali Crown of Blood: ఓటీటీలోకి రాజమౌళి సిరీస్.. ఎప్పుడు, ఎందులో వస్తుందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వారిలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకడు. అతడి తెరకెక్కించిన చిత్రాల్లో ఓ రేంజ్‌లో సెన్సేషన్ అయింది 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన 'బాహుబలి' రెండు భాగాలు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ను చూడడంతో పాటు కోట్ల వసూళ్లతో రికార్డులు తిరగరాసింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన యానిమేటెడ్ వెర్షన్‌ సిరీస్‌ను కూడా తెరపైకి తీసుకు రావాలని దర్శకుడు రాజమౌళి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Baahubali - Crown of Blood Movie Streaming on Disney plus Hotstar From May 17th

'బాహుబలి' యానిమేటెడ్ వెర్షన్‌ను 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌' (Baahubali Crown of Blood' అనే పేరుతో తీసుకు వస్తున్నట్లు రాజమౌళి ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు, 'మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు, ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రాబోతోంది' అని తెలిపారు.

దర్శకధీరుడు రాజమౌళి చెప్పినట్లుగానే 1.47 సెకెన్లు ఉన్న'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌' ట్రైలర్‌కు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ఈ సిరీస్‌కు సంబంధించిన స్టోరీ లైన్‌లో వివరిస్తూ విజువల్స్ చూపించారు. ముఖ్యంగా 'బాహుబలి' కథకు కొన్ని మార్పులు చేసి ఈ సిరీస్‌ను రూపొందించినట్లు చూపించారు. దీంతో దీనికి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌' సిరీస్‌ ట్రైలర్ రావడంతో దీని కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ డేట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అనౌన్స్ చేసింది. ఇందులో ఈ సిరీస్‌ను మే 17వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇది ఎన్ని భాషల్లో రాబోతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. విజువల్ వండర్‌గా రూపొందిన 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌' సిరీస్‌కు సంబంధించి స్పెషల్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలను హాట్‌స్టార్ మరికొద్ది రోజుల్లోనే తెలపబోతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X