Bigg Boss Non Stop: షోలోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బెస్ట్ ఎంటర్‌టైనర్ వచ్చేస్తున్నాడుగా!

కాన్సెప్టుతో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్‌ షోగా పేరు తెచ్చుకుంది. దీంతో నిర్వహకులు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను నడుపుతున్నారు. ఓటీటీలో వస్తున్న దీనికి కూడా మంచి స్పందనే దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ షోలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెంచేందుకు నిర్వహకులు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరు ఎంటర్ అవుతున్నారు? చూద్దాం పదండి!

ఆరంభం నుంచే ఆసక్తికరంగా

ఆరంభం నుంచే ఆసక్తికరంగా

తెలుగులో ఐదు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో సందడిగా సాగుతోంది. ఫలితంగా ఈ సీజన్ రోజురోజుకూ మరింత రంజుగా మారుతోంది.

17 మందిలో 6గురు బయటకు

17 మందిలో 6గురు బయటకు

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీళ్లలో నుంచి ఆరు వారాలకు గానూ ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపులు ఎలిమినేట్ అయిపోయారు.

నాన్ స్టాప్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు

నాన్ స్టాప్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు

బిగ్ బాస్ షో అంటేనే ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇక, ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లో ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని ముందు నుంచీ నిర్వహకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లోకి ఎంతో మంది గెస్టులు వస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి కూడా.

తెరపైకి ఆ సెలెబ్రిటీల పేర్లు

తెరపైకి ఆ సెలెబ్రిటీల పేర్లు

సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఫలానా సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా కొత్త మోడళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరో మాజీ కంటెస్టెంట్ రాక

మరో మాజీ కంటెస్టెంట్ రాక

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ మొదలై సగం రోజులు గడిచిపోయాయి. దీనికి మంచి ఆదరణే దక్కుతోంది. అయినప్పటికీ షోలోకి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకు రావాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓ మాజీ కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి తీసుకు వస్తున్నారట. అది కూడా ఈ రెండు రోజుల్లోనే ఆయన వస్తారని సమాచారం.

బెస్ట్ ఎంటర్‌టైనర్ రీఎంట్రీ

బెస్ట్ ఎంటర్‌టైనర్ రీఎంట్రీ

బిగ్ బాస్ మూడో సీజన్‌లో తనదైన కామెడీతో బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్. ఆ సీజన్‌లో ఆయన అద్భుతమైన ఆటతీరుతో పాటు నిజాయితీగా ఉంటూ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఫలితంగా ఫినాలేలో కూడా అడుగు పెట్టారు. చివరికి సెకెండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక, ఇప్పుడు బాబా నాన్ స్టాప్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నారట.

అది కంప్లీట్.. ఇందులో రచ్చ

అది కంప్లీట్.. ఇందులో రచ్చ

బాబా భాస్కర్ ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న ఇస్మార్ట్ జోడీ షోలో తన భార్యతో కలిసి పాల్గొంటున్నారు. ఆ షోకు సంబంధించిన షూట్ మొత్తాన్ని ఆయన కంప్లీట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వస్తున్నారట. ఈ రెండు రోజుల్లోనే ఆయన ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఇక, బాబా హౌస్‌లోకి వస్తే రచ్చ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X