Baby Hero పాత సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయి తీసిన మూవీ.. OTTలోకి వచ్చేసింది చూశారా?

బేబీ మూవీతో ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ క్రేజ్ అయితే దక్కింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఆనంద్ దేవరకొండ గతంలో నటించిన ఓ మూవీ నుంచి స్పూర్తిగా పొంది మలయాళంలో ఓ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఆ చిత్రం ఓటీటీలో అలరిస్తోంది. అసలు ఆ మూవీ ఏంటీ? దాని కథేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దొరసాని చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆనంద్ దేవరకొండ. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడిస్ అనే చిత్రంలో నటించారు. ఇక ఈ మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ అయి.. సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత పుష్పక విమానం అనే సినిమా తీశారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సరికొత్త కాన్సెప్టుతో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఇదే మూవీని ఇన్ స్పైర్ అయి... మలయాళంలో ఓ మూవీ తెరకెక్కింది.

Pushpaka Vimanam

ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం నుంచి స్పూర్తి పొంది తెరక్కిన మలయాళం మూవీ పద్మిని. ఈ మూవీ తెలుగులో తెరకెక్కిన పుష్పక విమానం సినిమాను పోలీ ఉంటుంది. ఓ కాలేజీ ఫ్రొఫెసర్( పుష్పక విమానం సినిమాలో ఆనంద్ టీచర్) తన భార్య ఫస్ట్ నైట్ రోజే లేచిపోతే.. వచ్చే పర్యవసనాలు చుట్టు అల్లిన కథే మలయాళం పద్మిని. ఇక ఈ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది.

పద్మిని సినిమాలో ప్రొఫెసర్ రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య విడాకులు ఇవ్వాలి. అంటే ఆ లేచిపోయిన ఆమె ఎక్కడుందో పట్టుకోవాలి. పుష్పక విమానంలో అయితే భార్య లేచిపోయిందనే విషయం ఎవరికీ చెప్పకుండా వెతుకుతూంటాడు ఆనంద్ దేవరకొండ. ఆమె స్థానంలో వేరే అమ్మాయిని తీసుకొచ్చి మేనేజ్ చేస్తూంటాడు. అదే మళయాళంలో కాస్త డిఫరెంటుగా నడిచింది.

ఇక ఈ పద్మిని మూవీ జులై 14న మలయాళంలో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్టుగా నిలిచింది. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అప‌ర్ణా బాల‌ముర‌ళి, మడోన్నా సెబాస్టియన్‌, విన్సీ అలోషియస్‌, మాళవిక మేనన్‌, సజిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొంత డ్రామా, కొంత కామెడీ మిక్స్‌ చేసి రూపొందిన పద్మిని సినిమా మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Pushpaka Vimanam

ఇప్పుడు ఈ పద్మిని మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (ఆగస్టు 11) నుంచి పద్మిని మూ స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. సినీ లవర్స్ అయితే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు. ఇక మాములు ప్రేక్షకులు సైతం ఓ సారి ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X