OTTలోకి బేబీ హీరో సస్పెన్స్ థ్రిల్లర్ కొత్త సినిమా... స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులో అంటే?
బేబీ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో విరాజ్ అశ్విన్. ఈ హ్యాండ్సమ్ హీరో... ఇప్పటికే పలు సినిమాల్లో నటించినప్పటికీ.. సరైనా గుర్తింపు రాలేదు. ఇక బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. అయితే ఈ హీరో నటించిన మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మాయ పేటిక సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమా ఎక్కడ, ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ కానుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
విరాజ్ అశ్విన్.... ఈ పేరు బేబీ సినిమాతో వెలుగులోకి వచ్చింది. 2018లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రహీరోకు సరైనా గుర్తింపు అయితే రాలేదు. ఈయన మొదటి సినిమా అనగనగ ఓ ప్రేమకథ. ఇక ఈ సినిమాతోనే ఈ కుర్ర హీరో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత 2019లో డైరెక్టర గా మారి యదా యదా హి ధర్మస్య మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు.

2021లో అనసయతో కలిసి థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాలో విరాజ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ కుర్రాడు ఎవరు అంటూ అందరూ షాక్ అయ్యారు. హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక 2022లో వాళ్లిద్దరి మధ్య, జోరుగా హుషారుగా సినిమాల్లో నటించాడు. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
2023లో రిలీజ్ అయిన బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చాడు విరాజ్. ఇక ఈసినిమాలో డబ్బున్న అబ్బాయిగా నటించి... ఓ వైపు అమ్మాయిని ప్రేమిస్తూనే నెగిటివిటీని చూపిస్తూ.. ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కంటే ముందే ఆయన మాయ పేటిక అనే సినిమా చేశాడు. ఈ సినిమా థియేటర్లలో రిలిజ్ అయి పర్వాలేదనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా... బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

థ్యాంక్యూ బ్రదర్ మూవీ డైరెక్టర్ రమేష్ రాపర్తియే ఈ మాయాపేటిక మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 30న థియేటర్లలోకి వచ్చింది. విరాజ్ అశ్విన్ తోపాటు సిమ్రన్ కౌర్, పాయల్ రాజ్‌పుత్ ఇందులో నటించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనున్నట్లు ఆహా టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇక మాయ పేటిక సినిమా విషయానికి వస్తే... రిలిజ్ అయిన రెండున్నర నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఇక విరాజ్ అశ్విన్ కు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఆహా ... ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహారించారు.

ఇక ఈ సినిమా కథ కాస్త విభిన్నంగా చూపించారు. నిజానికి ఇది ఆరు చిన్న కథల ఆంథాలజీ. ఓ మొబైల్ ఫోన్ ద్వారా వీళ్లు కనెక్ట్ అవుతారు. ఆ మొబైల్ ఈ ఆరు పాత్రల చేతులు ఎలా మారుతుంది? అది వీళ్ల జీవితాలను ఎలా మారుస్తుందన్నది అసలు కథ. మీరు గనుక ఈ సినిమాను థియేటర్లో మిస్ అయితే.. ఓటీటీలో చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











