వైష్ణవీ చైతన్యతో రొమాన్స్ చేసిన కుర్రాడి సినిమా OTTలోకి.. ఎక్కడ చూడాలంటే?
బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ వైష్ణవీ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతో విపరీతమైన సక్సెస్ అందుకున్న క్యూట్ బ్యూటీతో ఈ సినిమాలో ఓ కుర్రాడు చాలా ఘాటుగా రొమాన్స్ చేశాడు. లిప్ లాక్ సీన్ తో పాటు తనతో రాత్రంతా గడిపిన వీడియోను వైరల్ చేశాడు. అయితే ఇదంతా సినిమాలోనే అయినా ఫుల్ వైరల్ గా మారింది.
అయితే ఈ చిత్రంలో వైష్ణవీ చైతన్యతో రొమాన్స్ చేసిన హీరో పేరే విరాజ్ అశ్విన్. ఆయన హీరోగా ఓ కొత్త సినిమా చేయగా డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చింది. లవ్ డ్రామాతో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఏంటి, ప్రస్తుతం ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విరాజ్ అశ్విన్ హీరోగా చేసిన తాజా సినిమా జోరుగా హుషారుగా. ఈ సినిమాలో విరాజ్ సరసన పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించగా.. బ్రహ్మానందం, సోను ఠాకూర్, కేవశ్ దీపక్, సాయి కుమార్, రోహిణి, మధు నందన్, సిరి హన్మంతు, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా, జూనియర్ రేలంగి వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై నిరీష్ తిరువిధుల నిర్మించిన ఈ సినిమాకు అను ప్రసాద్ దర్శకత్వం వహించాడు.
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమాను డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. అయితే థియేటర్ల వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. ఫర్వాలేదనిపించిన ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీ చప్పుడు లేకుండా, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమాను.. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగూ చూసేయండి.

థియేటర్లలో ఈ సినిమాను చూడని వారితో పాటు ఇంట్లోనే కూర్చుని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు సరైన సినిమా ఇది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











