బాహుబలి నిర్మాతల నుంచి రొమాంటిక్ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అంటే?
ఓటీటీలకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ లభిస్తున్నది. పలు ఓటీటీ సంస్థలు ఒరిజినల్ కంటెంట్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ క్రమంలో బాహుబలి లాంటి చారిత్రత్మక చిత్రాన్ని అందించిన ఆర్కా మీడియా యక్షిణి అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్‌తో కలిసి ఆర్కా మీడియా నిర్మించిన యక్షిణి. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ తేజా మార్ని దర్శకత్వం వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ స్పెషల్‌గా తీర్చి దిద్దారు. ఈ చిత్రాన్ని త్వరలోనే స్ట్రీమింగ్ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

ప్రేమకు, రొమాన్స్‌కు చిహ్నమైన కృష్ణుడి కథగా యక్షిణి సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. శాపగ్రస్తులై భూమి మీద ఉన్న మాయ తనను కాపాడాలని వేడుకొంటుంది. యక్షిణిని కాపాడేందుకు వందమందిని తుదముట్టించి కృష్ణుడు ఆమెకు విముక్తి కలిగించే కథతో ఈ మూవీ రూపొందింది. ఆధునిక రొమాంటిక్ ఎంటర్‌టైనర్, థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు.
ఈ చిత్రంలో అందాల తార వేదిక, టాలెంటెడ్ యాక్టర్ మంచు లక్ష్మీ, అజయ్, రాహుల్ విజయ్ తదితరులు నటించారు. విజువల్ వండర్‌గా తెరపైన కనిపించేలా భారీ ఖర్చు, టెక్నాలజీతో ఈ సినిమాను సుందరంగా మార్చారు.

ఆర్కా మీడియా బ్యానర్‌పై తేజా మార్ని దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను జూన్‌లో రిలీజ్ చేయనున్నారు. గతంలో ఇదే బ్యానర్ నుంచి పరంపర అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











