Balagam OTT: ఓటీటీలోకి వచ్చేసిన బలగం.. తప్పుబట్టిన హీరో ప్రియదర్శి.. సంచలన ట్వీట్
తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవన స్థితిగతులను చూపిస్తూ మూవీలు ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడూ వస్తున్నాయి. అలాంటి చిత్రమే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని టాలీవుడ్‌లో కమెడియన్‌గా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వేణు తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు మీరే చూసేయండి మరి!

అలా విడుదలైన బలగం
కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందని చిత్రమే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అలాగే, ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను చేశారు.

అలాంటి టాక్‌తో సందడి
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే, వేరే ప్రాంతాల్లోనూ ఇది మంచి స్పందననే సొంతం చేసుకుంటోంది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి.

వసూళ్లతో.. కోట్ల లాభాలు
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బలగం' మూవీకి మూడు వారాల్లో అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు 9 కోట్ల రూపాయల వరకూ లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పుకోవాలి.

అమెజాన్‌లో బలగం రెడీ
'బలగం' మూవీకి థియేటర్లలో భారీ స్పందన వస్తుండడంతో ఇది అనుకున్నంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో మూడు వారాలకే స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నారట. దీంతో ఈ చిత్రాన్ని నేటి (మార్చి 24) నుంచి అందులో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ప్రియదర్శి షాకింగ్ ట్వీట్
ఒకవైపు 'బలగం' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, దీనిపై హీరో ప్రియదర్శి మాత్రం భిన్నంగా ట్వీట్ చేశాడు. 'లేదు.. బలగం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కావడం లేదు. నిరాధారమైన పుకార్లను నమ్మకండి. మీ దగ్గరలోని థియేటర్లలో ఈ అద్భుతమైన సినిమాను చూసి ఆస్వాదించండి' అని ట్వీట్ చేశాడు.

తెలీదా.. పబ్లిసిటీ స్టంటా?
'బలగం' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ జరుగుతున్నా.. అందులో హీరోగా నటించిన ప్రియదర్శి మాత్రం అది అబద్ధం అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయ్యే విషయం ప్రియదర్శికి నిజంగానే తెలియదా? లేక ఇదో పబ్లిసిటీ స్టంటా? అని చాలా మంది ఆ ట్వీట్ కింద కామెంట్లు పెడుతూ సందేహపడుతున్నారు.


Click it and Unblock the Notifications











