Bhagavanth Kesari OTT: కోట్లల్లో 'భగవంత్ కేసరి' ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే బాలయ్య రికార్డ్!
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ లయన్ గా పేరు తెచ్చుకున్న ఆయన సూపర్ ఎనర్జీతో పర్ఫామెన్స్ ఇస్తుంటారు. అలాగే యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. ఇటీవలే బర్త్ డే జరుపుకున్న బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఒక్కో సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ అందించారు. బాలయ్య చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి ఒకటి. ఈ సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. భారీ ధరకు ఓటీటీ డీల్ ఫిక్స్ అయి రికార్డ్ సృష్టించింది.
నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. యువరత్న బిరుదు నుంచి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ పేర్లతో ఆయన్ను అభిమానులు ముద్దుగా పిలుచుకునే వారు. ఇప్పుడు గ్లోబల్ లయన్ గా పిలుస్తూ అభిమానాన్ని చాటుతున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటే భగవంత్ కేసరి.

బాలకృష్ణ సినీ కెరీర్ లో 108వ సినిమాగా వస్తున్న భగవంత్ కేసరికి కామెడీ అండ్ యాక్షన్ చిత్రాలకు పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు.
ఇక ఇప్పటికే భగవంత్ కేసరి నుంచి విడుదలైన పోస్టర్స్, ఇటీవల్టీ టీజర్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న భగవంత్ కేసరి విడుదలకు ముందే ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు భారీగా పోటీ పడ్డాయని టాక్. ఈ పోటీలో చివరిగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ రై్స్ సొంతం చేసుకుందని సమాచారం. అంతేకాకుండా భగవంత్ కేసరి ఓటీటీ హక్కులు రూ. 18 కోట్లకు అమ్ముడు పోయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటన రాని ఈ విషయంపై చర్చ బాగా నడుస్తోంది. రిలీజ్ కు ముందే బాలయ్య రికార్డ్ క్రియేట్ చేసి తన స్టామినా చూపించాడని పలువురు అంటున్నారు.


Click it and Unblock the Notifications











