Unstoppable 2 గోపిచంద్ తర్వాతి సినిమాకు టైటిల్ చెప్పిన బాలయ్య.. ఇక తిరుగుండదంటూ భరోసా!

నందమూరి నటసింహం హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ఇటీవల ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ కు భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇక రెండో భాగం ఎపిసోడ్ ను కూడా ఇప్పుడు ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండో ఎపిసోడ్ లో గోపీచంద్ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. అలాగే తన సినీ కెరీర్ విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే గోపిచంద్ నెక్ట్స్ సినిమాకు నటసింహం బాలయ్య బాబు టైటిల్ ఫిక్స్ చేశాడు. అదేంటనే వివరాల్లోకి వెళితే..

 మరో గెస్టుగా గోపిచంద్..

మరో గెస్టుగా గోపిచంద్..

నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ 2. నాన్ స్టాప్ గా సాగుతున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్, మ్యాచో హీరో గోపీచంద్ కూడా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 29న మొదటి పార్ట్ ను విడుదల చేయగా.. తాజాగా రెండో పార్టును రిలీజ్ చేశారు.

తక్కువగానే మాట్లాడతా..

తక్కువగానే మాట్లాడతా..

గోపిచంద్ ఎంట్రీ ఇవ్వగానే రాణి గురించి అడిగి.. తర్వాత ప్రభాస్ పెళ్లి గురించి సరదాగా నవ్విస్తాడు బాలకృష్ణ. తర్వాత ప్రభాస్ చెప్పేవరకు అతని పెళ్లి వార్తలు రాయకూడదని మీడియాకు చెబుతాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. తర్వాత నువ్ ప్రభాస్ లాగే నవ్వుతుంటావా.. ఏమైనా మాట్లాడతావా అని బాలకృష్ణ అడిగితే.. మాట్లాడతాను సార్.. కానీ ఇద్దరం కొంచెం తక్కువగానే మాట్లాడతా అని చెబుతాడు గోపిచంద్.

నేను సైలెంట్ కాదు సార్..

నేను సైలెంట్ కాదు సార్..

రోజు అప్పుడప్పుడు కలుస్తాం అని గోపిచంద్ అంటే.. అమ్మా రోజు అప్పుడప్పుడు కలుస్తారా.. అంటే ఎన్నిసార్లు కలుస్తారు అని బాలకృష్ణ అడిగాడు. అలా ఏం లేదు సార్.. కలిసినప్పుడు అయితే ఫుల్ లేట్ నైట్ అవుతుంది. తెల్లారుతుంది అని గోపిచంద్ అంటాడు. నేను సైలెంట్ ఏం కాదు సార్.. బాగా మాట్లాడతాను. కానీ స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఆపు అనేంతవరకు మాట్లాడుతుంటాను సార్ అని ప్రభాస్ చెప్పాడు. దీంతో ఫస్ట్ గేర్ టఫ్పు.. ఫోర్త్ గేర్ స్మూత్ గా వెళ్లిపోతుంది అని బాలకృష్ణ అన్నాడు.

లౌక్యం తెలియదు సార్..

లౌక్యం తెలియదు సార్..

గోపీ నీ గ్రాఫ్ చూసుకుంటే.. ఫస్ట్ జయం, తర్వాత నిజం, తర్వాత వర్షం.. మూడు సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించావ్. ఆ తర్వాత యజ్ఞం, లక్ష్యం, రణం, శౌర్యం, శంఖం, లౌక్యం కొట్టావ్ అక్కడి నుంచి ఇక.. ఏమైనా లౌక్యం తెలుసుకున్నావా ఏంటీ అని బాలకృష్ణ అడిగాడు. లౌక్యం చేశాను గానీ, అంత లౌక్యం తెలియదు సార్ అని గోపిచంద్ అన్నాడు. తెలిసే ఉంటది సార్. లేకుంటా అన్ని హిట్లు ఎలా కొడతాడు అని ప్రభాస్ అన్నాడు.

నేను నీ సినిమాకు టైటిల్ పెడతా..

నేను నీ సినిమాకు టైటిల్ పెడతా..

నీకు ఏమో టైటిల్ చివర్లో సున్న.. నాకేమో టైటిల్ మధ్యలో సున్న.. సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, అఖండ ఇదో సెంటిమెంట్ అని బాలకృష్ణ చెప్పాడు. తర్వాత నువ్ నా షోకి వచ్చావ్ కదా.. నీ సినిమాకు నేను ఒక టైటిల్ పెడతా అని బాలకృష్ణ అన్నాడు. మీరు పెడితే మంచి ముహుర్తం చూసి పెడతార్ సార్. అదిరిపోద్ది. పెట్టించేస్కో అని ప్రభాస్ అన్నాడు.

అదిరిపోయింది టైటిల్..

అదిరిపోయింది టైటిల్..

ముహుర్తం కూడా సరిపోదయా.. అక్షర బలం కూడా కావాలి అని బాలకృష్ణ అన్నాడు. తర్వతా నీ నెక్ట్స్ సినిమా టైటిల్.. నీ సెంటిమెంట్ ను బట్టే.. లాస్ట్ లో సున్న వస్తుంది. మళ్లీ నువ్ అన్ స్టాపబుల్ షోకి వచ్చావ్ కాబట్టి.. నిన్ను ఎవరు ఆపకూడదు కాబట్టి.. నీ సినిమా టైటిల్.. ''రామ బాణం'' అని బాలకృష్ణ చెప్పాడు. దీంతో అందరూ చప్పట్లు కొట్టారు. సూపర్ సర్, చాలా బాగుంది, వెరీ గుడ్, అదిరిపోయింది అని గోపిచంద్ అన్నాడు.

 నీకు కలిసొచ్చిన డైరెక్టర్..

నీకు కలిసొచ్చిన డైరెక్టర్..

బాలకృష్ణ పెట్టిన టైటిల్ అని చెప్పండి.. ఇక ఎదురు ఉండదు దానికి. వంద రోజుల ఫంక్షన్ కు నేను వస్తా అని బాలకృష్ణ భరోసా ఇచ్చాడు. దీంతో థ్యాంక్యూ సో మచ్ అంటూ సంతోషించాడు గోపిచంద్. ఎవరు మీ డైరెక్టర్ శ్రీవాస్ కదా.. నీకు బాగా కలిసొచ్చిన హాట్రిక్ డైరెక్టర్. నాతో డిక్టెటర్ తీశాడు.. ఇప్పుడు నీకు ఇది హాట్రిక్ అని బాలకృష్ణ చెప్పాడు. తర్వాత గోపిచంద్ సినిమాల్లో స్టైలిష్ మూవీ జిల్ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X