Daaku Maharaaj OTT: ఓటీటీలోకి డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Daaku Maharaaj OTT: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబో మూవీ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ భారీ విజయం దక్కించకుంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ హైయాక్షన్ వోల్టేజీ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ మూవీ ఓటీటీ హక్కులను ఎవరు సొంతం చేసున్నారు. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందంటే ?
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో బాలయ్య మంచి ఊపులో ఉన్నారు. ఈ తరుణంలో వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్‌పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు.. వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్‌కు మంచి హిట్ అందించిన కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డాకు మహారాజ్ రూ. 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందే. దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్. ఇది బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నయా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక కలెక్షన్ల పరంగా చూస్తే.. డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే.. డాకు మహారాజ్ ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 124 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. వీకెండ్ కావడంతో రోజు కలెక్షన్లు పుంజుకునే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య విన్నర్ గా నిలిచారు. అలాగే.. బాలయ్య కేరీర్ లో వరుసగా నాలుగు సార్లు రూ. 100 కోట్ల వసూలు రాబట్టి నయా రికార్డు క్రియేట్ చేశారు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.

ఇదిలా ఉండగా .. సినిమా రిలీజ్10 రోజులు కూడా కాలేదు.. డాకు మహారాజ్‌ను ఓటీటీ (Daaku Maharaaj OTT )లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇకపోతే .. డాకు మహారాజ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఎన్ని కోట్లకు డీల్ సెట్ అయిందో అధికారిక ప్రకటన రాలేదు. కానీ, డాకు మహారాజ్' మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
అయితే..ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి సినిమా స్ట్రీమింగ్ కావాలి. దీనిని బట్టి డాకు మహారాజ్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 10 తరువాత నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్రకటన విడుదల చేసే అవకాశముంది.


Click it and Unblock the Notifications











