twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: షోలో బాలకృష్ణ బూతుల గోల.. పరువు తీసిన వరలక్ష్మీ.. కొడకా అంటూ ఘోరంగా!

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలతో వెండితెరపైనే కాకుండా ఇటు డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సినిమాల పరంగా వీర సింహా రెడ్డి అవతారమెత్తిన బాలయ్య బాబు వసూళ్లపై దండెత్తాడు. బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా కమర్షియల్ హిట్ ట్రాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డిజిటల్ తెరపై అన్ స్టాపబుల్ షో ద్వారా హోస్ట్ గా అదరగొడుతున్నాడు బాలయ్య బాబు. ఇదివరకు ప్రభాస్, గోపిచంద్ వచ్చి సందడి చేయగా తాజాగా వీర సింహా రెడ్డి సినిమా బృందం వచ్చి అలరించింది. ఈ ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    అన్ స్టాపబుల్ గా..

    అన్ స్టాపబుల్ గా..

    బాలయ్య బాబు హోస్ట్ గా అలరిస్తున్న ఆహా అన్ స్టాపబుల్ షోకు మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అతిథులుగా వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచో హీరో గోపిచంద్ వచ్చి అన్ స్టాపబుల్ షోకి మరింత క్రేజ్ పెరిగింది. ఫలితంగా ఆహా ఓటీటీకి సబ్ స్క్రైబర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తర్వాతి ఎపిసోడ్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ప్లాన్ చేయాలని భావించారు మేకర్స్.

    సంక్రాంతికి స్పెషల్ ఎపిసోడ్..

    సంక్రాంతికి స్పెషల్ ఎపిసోడ్..

    ముందస్తు ప్రణాళిక ప్రకారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ కూడా పూర్తి చేశారు. ఈ ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయడంతో పాటు సెకండ్ సీజన్ ను ముగించాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా మధ్యలో వీర సింహా రెడ్డి సినిమా యూనిట్ స్పెషల్ ఎపిసోడ్ ను తీసుకువచ్చింది ఆహా టీమ్. అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కంటే ముందుగా సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి మూవీ టీమ్ తో ఎపిసోడ్ ను తాజాగా విడుదల చేశారు.

    వీర సింహా రెడ్డి కుటుంబాన్ని..

    వీర సింహా రెడ్డి కుటుంబాన్ని..

    ఎపిసోడ్ లో సంక్రాంతి పండుగ గొప్పదనాన్ని, దాని విశిష్టతను వివరించారు నందమూరి నటసింహం బాలయ్య బాబు. అనంతరం సంక్రాంతి అంటే తెలుగు సినిమా సందడి అన్న బాలకృష్ణ సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన అన్ స్టాపబుల్ అని డైలాగ్ చెప్పాడు. దీంతో షోలలో అరుపు కేకలతో మారుమోగిపోయింది. ఇవాళ నా వీర సింహా రెడ్డి కుటుంబాన్ని చూస్తారంటూ ముందుగా వరలక్ష్మీ శరత్ కుమార్, గోపిచంద్ మలినేని ఆహ్వానించాడు బాలకృష్ణ.

    మహిళలను గౌరవించాలనే..

    మహిళలను గౌరవించాలనే..

    గోపిచంద్ మలినేని, వరలక్ష్మీ స్టేజిపైకి వచ్చేటప్పుడు డైరెక్టర్ గోపిచంద్ ను పక్కకు జరగమని వరలక్ష్మీ శరత్ కుమార్ హగ్ ఇచ్చాడు బాలకృష్ణ. తర్వాత గోపిచంద్ ను సంతోషంగా మనసుకు హత్తుకున్నాడు. నిన్ను వదిలి ముందు వరలక్ష్మీని హగ్ చేసుకున్నందుకు మళ్లీ బాధపడకు. లేడీస్ ఫస్ట్ అన్నారు. మహిళలను గౌరవించాలనే అలా చేశాను అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తర్వాత తెలుగింటి ఆడపడుచులు అంటూ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ను చెప్పారు బాలయ్య బాబు.

    పాజిటివ్ ఎనర్జీ..

    పాజిటివ్ ఎనర్జీ..

    రవితేజకు గోపిచంద్ మలినేనితో ఫోన్ చేయించి షోను మొదలు పెట్టాడు బాలకృష్ణ. రవితేజతో సరదాగా మాట్లాడాడు బాలకృష్ణ. అనంతరం నా గురించి ఏమైనా తెలుసుకున్నావా అని వరలక్ష్మీని అడిగాడు బాలయ్య బాబు. మీకు చాలా కోపం అని విన్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం పాజిటివ్ ఎనర్జీనే మీ నుంచి వరలక్ష్షీ చెప్పింది. తర్వాత సాధారణంగా నేనే ఎక్కువ హైపర్.. మీరు నాకంటే ఎక్కువ హైపర్ గా ఉన్నారు తెలిపింది.

    తల దించుకున్న బాలయ్య..

    తల దించుకున్న బాలయ్య..

    గోపిచంద్, వరలక్ష్మీతో బాలకృష్ణ గురించి ఎవరికీ ఎక్కువగా తెలుసు అని క్విజ్ పెట్టాడు బాలయ్య బాబు. ఎక్కువగా నేను వాడే పదం ఏంటీ అని బాలకృష్ణ అడిగితే ముందుగా బజర్ నొక్కిన వరలక్ష్మీ.. చంపుతా నా కొడకా అని యాక్షన్ తోపాటు చేసి చూపించింది. వరలక్ష్మీ అలా చెప్పడంతో.. బాలయ్య కొద్దిగా అవమానంగా తల దించుకున్నట్లు అనిపించింది. తర్వాత గోపిచంద్ అని అడిగితే.. లమ్xx కొడకా అని చెప్పాడు.. తర్వాత నేను చెప్పనా ఏమంటానో అని చంపుతా.. లమ్xx కొడకా అని అన్నాడు. హా అదే అంటారు అని వరలక్ష్మీ చెప్పింది. ఇలా బాలకృష్ణ తరచుగా వాడే పదం బూతు అని తెలిసింది. ఈ బూతు పదాలతో షో గోలగోలగా మారింది.

    English summary
    Nandamuri Balakrishna Abused Words In Unstoppable 2 Episode And Making Fun With Veera Simha Reddy Team Varalaxmi Sarathkumar Gopichand Malineni
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X