twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: మీడియాకు బాలకృష్ణ వార్నింగ్.. అలా రాసి దొబ్బకండి అంటూ షాకింగ్ గా!

    |

    నందమారి నటసింహం బాలయ్య బాబు 62 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న 'Unstoppable with NBK' షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతున్న ఈ షోకి ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపిచంద్ హాజరయ్యారు. వీరి ఎపిసోడ్ ను రెండు భాగాలుగా టెలీక్యాస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాహుబలి మొదటి పార్టును డిసెంబర్ 29న విడుదల చేయగా తాజాగా జనవరి 6న రెండో భాగాన్ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో మీడియాకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.

    యంగ్ హీరోల నుంచి..

    యంగ్ హీరోల నుంచి..

    సినిమాల్లోనే కాకుండా డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చింది తెలిసిన సంగతే. పవర్ ఫుల్ రాజకీయన నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో మొదటి ఎపిసోడ్ ను ప్రారంభించి యంగ్ హీరోల నుంచి సీనియర్ దర్శకుల వరకు ఇంటర్వ్యూ చేసి మెస్మైరైజ్ చేస్తున్నాడు బాలయ్య బాబు.

    అభిమానులకు గుడ్ న్యూస్..

    అభిమానులకు గుడ్ న్యూస్..

    బాలకృష్ణతో ప్రభాస్, గోపిచంద్ లు చేసిన అల్లరి ఇంటర్వ్యూ నిడివి భారీగా ఉండటంతో బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2గా రెండు ఎపిసోడ్స్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ బాహుబలి పార్ట్ 1 ఎపిసోడ్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు ప్రసారం చేసి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఇప్పుడు తాజాగా జనవరి 6 అంటే ఇవాళ రెండో పార్టును ఆహాలో స్ట్రీమింగ్ చేశారు.

    ఈ పెళ్లి గొడవ నాకొద్దు..

    ఈ పెళ్లి గొడవ నాకొద్దు..

    రెండో పార్టులో గోపిచంద్ ను ఇన్వైట్ చేశారు బాలకృష్ణ. వచ్చి రాగానే రాణి ఎవరు, గుడ్ న్యూస్ ఏంటి అని గోపిచంద్ ను అడిగారు బాలకృష్ణ. దీంతో ఏదైనా పూర్తిగా చెప్పు అని ప్రభాస్ అంటూ ఉన్నాడు. ఇలా ఈ విషయం గురించి ప్రభాస్, గోపిచంద్ తో సరదాగా ఆటపట్టించాడు బాలకృష్ణ. తర్వాత గోపీ నాకు చాలా విసుగు పుట్టిందయ్యా. ఇప్పుడు ఈ పెళ్లి గొడవ నాకు వద్దు అని చెప్పిన బాలకృష్ణ ఒక ఫొటో వేయండమ్మా అని చెప్పాడు.

    ప్రభాస్ కు పెళ్లి అయినట్లు ఆర్టికల్..

    ప్రభాస్ కు పెళ్లి అయినట్లు ఆర్టికల్..

    బాలకృష్ణ ఫొటో వేయమనడంతో.. ఆ ఫొటోలో ప్రభాస్ పెళ్లి కొడుకు గెటప్ లో ఉండి పెళ్లి కూతురిని హగ్ చేసుకుని ఉంది. అది ఒక ఆంగ్ల వెబ్ సైట్ లో వచ్చిన న్యూస్. అందులో మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ కు పెళ్లి జరిగింది. ఎంతోమంది అమ్మాయిల గుండె ముక్కలు అయిందని ఆర్టికల్ రాసి ఉంది. దీంతో అదేంటని గోపిచంద్-ప్రభాస్ సైగలు చేసుకున్నారు. అది ప్రభాసే అని గోపిచంద్ అంటే.. ఆ అమ్మాయి ఎవరు సార్ అని ప్రభాస్ అంటాడు.

    ఆ ఫొటో నువ్వే తీశావ్..

    ఆ ఫొటో నువ్వే తీశావ్..

    ప్రభాస్ అన్నదానికి అదే అడుగుతున్నా అమ్మాయి ఎవరు అని బాలకృష్ణ అన్నాడు. నాకు తెలియట్లేదు ఆ అమ్మాయి. మా అమ్మ చూస్తే కంగారు పడుతుందని ప్రభాస్ అంటాడు. కంగారులో సంతోషం ఉండుద్ది అని గోపిచంద్ అంటాడు. తర్వాత అది అంత పర్ఫెక్ట్ గా చేశారు ఎవర్రా బాబు అని ప్రభాస్ కంగారుపడుతుంటాడు. ప్రభాస్ భీమవరం, గోపిచంద్ ఒంగోలు తెలివితేటలు చూపించకండి.. నువ్వే ఆ ఫొటో తీశావ్.. నీ ఫోన్ లో నుంచే తీసుకున్నా అని గోపిచంద్ ను అంటాడు బాలకృష్ణ.

    నాకే ఫస్ట్ తెలుస్తుంది..

    నాకే ఫస్ట్ తెలుస్తుంది..

    అప్పుడు గోపిచంద్ ఆ మ్యారేజీ గురించి ఏదో ఒక స్టోరీ అల్లి చెబుతాడు. ఎవరో మ్యారేజీలో ఆ అమ్మాయిని ప్రభాస్ ఓదారుస్తున్నాడని చెప్పి కవర్ చేస్తాడు గోపిచంద్. కానీ గోపీ ఏదో ఇదంతా చేశాను గానీ, ప్రభాస్ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే నాకే ఫస్ట్ తెలుస్తుంది. ఇది అంతా సరదానే. టీవీ ముఖంగా నువ్వే ఒక పుల్ స్టాఫ్ పెట్టేసేయ్ అని ప్రభాస్ ను ఇరికిస్తాడు బాలకృష్ణ. దీంతో ఇదెక్కడి దారుణం సార్.. అయిపోయింది ఈ టాపిక్ అని చెప్పి మళ్లీ తీసుకొచ్చారు. వీళ్లు నా ఫ్రెండ్స్ అనుకున్నా కానీ నా శత్రువులు సార్ అని ప్రభాస్ అంటాడు.

    అలా రాసి దొబ్బకండి..

    అలా రాసి దొబ్బకండి..

    ప్రభాస్ అలా అనడంతో.. యే.. ఇప్పుడు చెబుతున్నా.. బాలకృష్ణ స్టేజీ మీద చెబుతున్నాడు. ఇప్పుడు ఈ పోగ్రామ్ చూసి మీకు ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ రాసి దొబ్బకండి. ఇదంతా సరదా. అర్థమైంది కదా. ప్రభాస్ పెళ్లి న్యూస్ ప్రభాసే చెబుతాడు. మీరు ప్రభాస్ కు చెప్పకండి బాగోదు అని మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య బాబు. దీంతో నవ్వేసి ప్రభాస్.. నాకు తెలిసినప్పుడు చెబుతా అని అంటాడు.

    English summary
    Nandamuri Balakrishna Warning To Media Over Prabhas Marriage News Articles Rumours In Unstoppable 2 Baahubali Episode Part 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X