Unstoppable 2: బాలకృష్ణ తర్వాతి హీరోయిన్ గా ఆ విలన్.. చెల్లి నుంచి చెలికి అంటూ ప్రామిస్!
తెలుగు ఓటీటీ సంస్థల్లో అత్యంత ప్రజాదరణ పొందింది ఆహా. విభిన్నమైన షోలు, సినిమాలతో అలరిస్తుంది ఆహా. ఇందులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది అన్ స్టాపబుల్. ఈ టాక్ షోతో మొదటిసారిగా నందమూరి నటసింహం బాలకృష్ణను హోస్ట్ గా పరిచయం చేశారు. తన వైవిధ్యమైన నటనతో అలరించే బాలకృష్ణ హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు. మొదటి సీజన్ లానే రెండో సీజన్ కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. మరికొన్ని రోజుల్లో ఈ రెండో సీజన్ కూడా పూర్తి కానుంది. ఇక తాజాగా సంక్రాంతి కానుకగా బాలయ్య బాబు నటించిన వీర సింహా రెడ్డి సినిమా టీమ్ అన్ స్టాపబుల్ షోలో సందడి చేసింది.

కమర్షియల్ హిట్ టాక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలతో వెండితెరపైనే కాకుండా ఇటు డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సినిమాల పరంగా వీర సింహా రెడ్డి అవతారమెత్తిన బాలయ్య బాబు వసూళ్లపై దండెత్తాడు. బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా కమర్షియల్ హిట్ ట్రాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ హోస్ట్ గా అదరగొడుతున్న అన్ స్టాపబుల్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో వీర సింహా రెడ్డి సందడి చేసింది.

నిజమైన అన్ స్టాపబుల్..
అన్ స్టాపబుల్ రెండో సీజన్ తాజా ఎపిసోడ్ లో సంక్రాంతి పండుగ గొప్పదనాన్ని, దాని విశిష్టతను వివరించారు నందమూరి నటసింహం బాలయ్య బాబు. అనంతరం సంక్రాంతి అంటే తెలుగు సినిమా సందడి అన్న బాలకృష్ణ సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన అన్ స్టాపబుల్ అని డైలాగ్ చెప్పాడు. దీంతో షోలలో అరుపు కేకలతో మారుమోగిపోయింది. ఇవాళ నా వీర సింహా రెడ్డి కుటుంబాన్ని చూస్తారంటూ ముందుగా వరలక్ష్మీ శరత్ కుమార్, గోపిచంద్ మలినేని ఆహ్వానించాడు బాలకృష్ణ.

చారిత్రాత్మక చిత్రం చేద్దాం..
షోలో వీర సింహా రెడ్డి ట్రైలర్ ను చూపించారు. తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ చేత ఒక డైలాగ్ చెప్పించాడు బాలకృష్ణ. అనంతరం షూటింగ్ అప్పుడు నీకు ఒక మాట చెప్పాను గుర్తుందా. మనిద్దరం మళ్లీ ఇంకొక సినిమా చేద్దామని చెప్పా. ఒక మంచి చారిత్రాత్మక చిత్రం చేద్దామని ఆవిడతో చెప్పాను. పల్నాటి యుద్దం సినిమా తరహాలో నువ్వు నాగమ్మ నాయకురాలు చేయి.. నేను తాండ్ర పాపారావు చేస్తాను అని తొడ కొట్టాడు బాలయ్య బాబు.

చిన్న పిల్లల ఉన్నావ్..
అలాంటి ఒక ఆర్టిస్ట్ దొరికింది. ఒక ఆణిముత్యం లాంటి ఆర్టిస్ట్ అని చెప్పిన బాలకృష్ణ తర్వాత సినిమా ఎలా స్టార్ట్ అయిందో చెప్పాడు. ఒకరోజు స్టోరితో మొదలైన ఈ సినిమా చివరికీ వంద రోజుల సినిమాగా వచ్చిందని బాలకృష్ణ అన్నారు. అనంతరం వర ఇప్పుడు నిన్ను చూస్తుంటే హీరోయిన్ లా ఉన్నావ్.. చిన్న పిల్లల ఉన్నావ్.. ఈయనేమో చీర కట్టి.. తెల్ల జుట్టు వేసి తీసుకొచ్చాడు. ఇది అన్ స్టాపబుల్ షో.. స్టార్టింగ్ లో నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా.. ఏదో ఒక రోజు మనిద్దరం హీరో హీరోయిన్లుగా సినిమా చేద్దాం అని బాలకృష్ణ తెలిపాడు.

నేను రోజు అదే చేస్తాను..
బాలకృష్ణ అలా అనడంతో హై ఫైవ్ అంటూ పైకి లేచి వచ్చి బాలయ్యకు హై ఫైవ్ ఇచ్చింది. నువ్ హీరోయిన్ అయినా రోజున మరో ప్రామిస్ చేస్తున్నా. అప్పుడు సెట్ కి గోపిని పిలుద్దాం. నన్ను విలన్ గా ఎందుకు చేశావ్ రా అని పొడిచేయ్ అని బాలకృష్ణ అంటే.. నేను రోజు అదే చేస్తాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే అన్నాను అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది. ఎప్పుడు నన్ను ఎందుకు విలన్ ను చేస్తున్నావ్.. క్రాక్ లో అలానే.. ఇప్పుడు ఇందులో అలానే చేశావ్ అని అంటుందని గోపిచంద్ చెప్పాడు.

చెల్లి నుంచి చెలిగా
నువ్వు మల్టీ టాలెంటెడ్. వర్సటైల్ యాక్టర్. మాకు మోహన్ బాబు ఎలాగో నువ్ అలాగా. అన్ని రకాలుగా ఆల్ రౌండర్ అని వరలక్ష్మీని అన్నాడు బాలకృష్ణ. అనంతరం వరలక్ష్మీ శరత్ కుమార్ వెళ్లిపోయేటప్పుడు.. చెల్లెలిగా చేశావ్.. చెలి కత్తెగా చేశావ్.. ఇకనుంచి నా చెలిగా చేస్తావ్.. చెలిగా.. (లవర్ గా, హీరోయిన్ గా) చెల్లిగా కాదు చెలి అంటే జంటగా. మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అని బాలకృష్ణ అన్నాడు. ఇలా తన తర్వాత సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రామిస్ చేశాడు బాలకృష్ణ.


Click it and Unblock the Notifications











