Unstoppable Season 2 review: నాకు రెండో ఫ్యామిలీ ఉంది: బాలకృష్ణ, 420 అని ఎగతాళి చేశారు.. చంద్రబాబు
నందమూరి బాలకృష్ణ ప్రారంభించిన అన్‌స్టాపబుల్ గేమ్ షో మరో లెవెల్‌కు వెళ్లింది. దేశంలోనే టాప్ రేటింగ్‌ను సాధించడమే కాకుండా టాక్ షోలకే అమ్మ మొగుడుగా నిలిచింది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా రావడంతో స్పెషల్‌గా మారింది. ఈ సందర్బంగా చంద్రబాబు, బాలకృష్ణ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఏమిటంటే?

నాకు రెండో ఫ్యామిలీ అంటూ
చంద్రబాబు నాయుడితో మాట్లాడుతూ.. నాకు అఫీషియల్‌గా రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. ఒకటి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 లో వసుంధర.. నా పిల్లలు. ఇక రెండో ఫ్యామిలీ అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఆగు.. వసుకు నేను ఫోన్ చేసి బ్రేకింగ్ న్యూస్ చెబుతా అంటూ చంద్రబాబు ఫోన్ తీస్తే.. ఆగు బావ.. నేను చెప్పేది పూర్తిగా విను. నాకు రెండో ఫ్యామిలీ అన్‌స్టాపబుల్ సీజన్ 2. ఈ గేమ్ షోతో నేను, నా ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యాం అని బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్‌ను తొలిసారిగా ఎప్పుడు కలిశానంటే?
బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇస్తూ.. నేను సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అనురాగదేవత సినిమా షూటింగు రామకృష్ణ సినీ స్టూడియోలో కలిశాను. ఆ సమయంలో శ్రీదేవితో శోభనం సీన్ షూట్ చేస్తున్నారు. అప్పుడు ఆయనను కలిసినప్పుడు భవిష్యత్‌లో ఏం జరుగుతున్నదో గ్రహించే రాజకీయ నేత అని చంద్రబాబు అన్నారు. దాంతో రాళ్లు రప్పలుగా ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని సైబరాబాద్‌గా మార్చి వేలకోట్ల ఆదాయాన్ని సమకూర్చిన విజన్ మీది అని బాలకృష్ణ ప్రశంసించారు.

నన్ను 420 అన్నారు అంటూ చంద్రబాబు
హైదరాబాద్‌ను అభివృద్ధిని చేయాలనే సంకల్సం నాలో మొదటి నుంచి ఉంది. తెలుగువాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేది. ఆ సమయంలో ప్రపంచంలోని చాలా విషయాలను అధ్యయనం చేశాను. నేను 2020 విజన్ అంటే 420 అని ఎగతాళి చేశారు. టెలిఫోన్ సర్వీస్ తీసుకొస్తే.. ఎగతాళి చేశారు. ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు. భార్య లేకున్నా ఫోన్ ఉంటే చాలూ.. భర్త లేకున్నా భార్యకు ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చింది అని చంద్రబాబు అన్నారు.

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడుతా
హైదరాబాద్‌లో పార్కులు, గార్డెన్స్ అభివృద్ధి చేశారు కదా.. వాటికి కృష్ణకాంత్ లాంటి తెలుగు జాతికి సంబంధం లేని రాజకీయ నేతల పేర్లు పెట్టారు ఎందుకని బాలకృష్ణ అడిగితే... ప్రాంతాలకు, కుల, మతాలకు సంబంధం లేకుండా వారు సేవ చేశారు. అందుకే వారి పేర్లు పెట్టాను. కానీ తెలుగు వారికి సేవ చేసిన ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించారు. కానీ ఏడాదిన్నర తర్వాత మా రోజు వస్తుంది.. అప్పుడు ఎన్టీఆర్ పేరు మళ్లీ హెల్త్ యూనివర్సిటీకి పెడుతాను అని చంద్రబాబు చెప్పారు.

నా పెళ్లి రోజు మరిచిపోలేని విషయం
నా జీవితంలో గొప్ప రోజు, గొప్ప విషయం నా పెళ్లి రోజు. నా భార్యతో వేసిన అడుగు మరిచిపోలేను అని చంద్రబాబు అంటే.. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఎలా ఉన్నారు బావ అని అడుగుతాను. కానీ ఎలా ఉన్నావు చెల్లమ్మ అని అడగను. ఎందుకంటే.. మీ వద్ద నా చెల్లెలు చాలా క్షేమంగా ఉంటుందనే నమ్మకం. అందుకే నేను ఎప్పుడు అడగను అని బాలకృష్ణ అన్నారు. దానికి థ్యాంక్యూ అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











