Balakrishna: హీరో పరువు తీసిన బాలయ్య.. మీడియాను లాగి మరి కామెంట్స్.. రిటైర్ అవుతానంటూ!

తెలుగు చిత్రసీమలో టాలెంట్ ఉండి అవకాశాలు తక్కువ అందుకునే హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో నవదీప్ ఒకరు. జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్, విలన్ గా నటించి అలరించాడు. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత నవదీప్ ప్రధాన పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ క్రమంలోనే నవదీప్ పరువు తీసేశాడు నటంసింహం బాలకృష్ణ.

 తాజాగా థ్రిల్లర్ ఎంటర్టైన్ మెంట్..

తాజాగా థ్రిల్లర్ ఎంటర్టైన్ మెంట్..

ఇటీవల కాలంలో ఓటీటీల సందడి ఎక్కువైపోయింది. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎక్కువైపోయారు. అందుకు అనుగుణంగానే చిత్రాలు తెరకెక్కిస్తున్నాయి ఆ సంస్థలు. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆహా. ఎన్నో వైవిధ్యమైన షోలు, సినిమాలు, సిరీస్ లను నిర్మిస్తోన్న ఆహా తాజాగా థ్రిల్లర్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వనుంది.

90వ దశకంలో..

90వ దశకంలో..

హీరో నవదీప్, బ్యూటిఫుల్ బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ వెబ్ సిరీస్ ప్రవీణ్ దర్శకత్వంలో కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 1990-2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్లబ్ లోని స్ట్రింగర్స్ కు సంబంధించిన కథాంశంతో ఇది తరెక్కింది. మీడియా పాత్ర, వార్తలా ప్రాధాన్యత, సెన్సేషనల్ న్యూస్ వంటి తదితర అంశాలను చూపించనున్నారు.

 నాన్ సెన్స్ కాదు.. న్యూసెన్స్..

నాన్ సెన్స్ కాదు.. న్యూసెన్స్..

తాజాగా న్యూసెన్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ ఐడల్ 2 తాజా ఎపిసోడ్ కు నవదీప్, బిందు మాధవి వచ్చారు. న్యాయ నిర్ణేతలు తమన్, గీతా మాధురి, కార్తీక్ లతో పాటు బాలకృష్ణ ఉన్నారు. ఈ క్రమంలోనే నవదీప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు బాలయ్య బాబు. స్టేజీపైకి వచ్చిన నవదీప్, బిందు మాధవి పాటలు పాడటంతో ఏంటీ ఈ నాన్ సెన్స్ అని బాలకృష్ణ అంటే నాన్ సెన్స్ కాదు సార్.. న్యూసెన్స్ అని బిందు మాధవి తెలిపింది.

 చాలా చిన్నవయసులోనే..

చాలా చిన్నవయసులోనే..

జర్నలిజం మీద కొత్తగా వెబ్ సిరీస్ చేశాం సార్ అని నవదీప్ చెప్పాడు. దీంతో "జర్నలిజం మీదనా.. ఆదివారం పొద్దున టీవీ పెడితే.. శనివారం సాయంత్రం నవదీప్ ఎక్కడో దొరికిపోయాడు. అర్ధరాత్రి కారు వదిలి పారిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో క్యాచ్.. ఇదే కదా న్యూస్.. రివేంజా" అని బాలకృష్ణ ఫన్నీగా నవదీప్ పరువు తీశారు. దీనికి "సార్.. మీడియా వాళ్లతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని చాలా చిన్న వయసులోనే తెలుసుకున్నాను" అని నవదీప్ అన్నాడు.

అదంతా కావాలనే చేశావ్..

అదంతా కావాలనే చేశావ్..

అంటే నీకు పాపులారిటీ వచ్చిందే వాళ్ల వల్ల అని బాలకృష్ణ అంటే అవును సార్ అని నవదీప్ అన్నాడు. అలా అయితే అదంతా నువ్వు కావాలని చేశావ్ అని బాలకృష్ణ అన్నాడు. దానికి అంటే నేను కొన్ని చేశాను సార్. కొన్ని నా చేత చేపించారు సార్. కొన్ని జరగకుండానే చెప్పేసారు సార్ అని నవదీప్ చెప్పాడు. దీంతో అక్కడున్న వాళ్లంత నవ్వేశారు. తర్వాత న్యూసెన్స్ టీజర్ వేశారు. "జర్నలిజం అంటే న్యూస్ చూపిస్తారు. చూపిస్తుందే నిజమా.. నిజాన్నే చూపిస్తున్నారా అనే యాంగిల్ లో ఈ సిరీస్ ఉంటుంది" అని నవదీప్ తెలిపాడు. తర్వాత న్యూసెన్స్ టీమ్ కు బాలకృష్ణ, తమన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X