Bhagavanth Kesari OTT: ఫేమస్ ఓటీటీలోనే భగవంత్ కేసరి.. అన్ని రోజులకే బాలయ్య రాక

ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే సీనియర్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపిస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా నేడే (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే 'భగవంత్ కేసరి'. ఈ చిత్రానికి యూఎస్‌లోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ బజ్‌ ఉంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే లభిస్తోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ అదిరిపోయాయి. దీంతో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'భగవంత్ కేసరి' మూవీ ఓటీటీ వివరాలు రివీల్ అయ్యాయి.

Balakrishna Starrer Bhagavanth Kesari Movie Digital Partner and Streaming Date Details

అనిల్ రావిపూడి - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీపై క్రమంగా అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ వివరాలను సినిమా టైటిల్ కార్డ్స్‌లో రివీల్ చేశారు.

బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే అక్టోబర్ 19వ తేదీన విడుదలైన 'భగవంత్ కేసరి' డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. బాలయ్య కెరీర్‌లోనే విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X