Bhagavanth Kesari OTT: భగవంత్ కేసరి ఓటీటీ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కోసం స్పెషల్ సర్‌ప్రైజ్
ఆ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అయినా.. ఇప్పుడు వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దీంతో ఎన్నో అంచనాలతో ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో దక్కింది. దీంతో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది.

బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' మూవీ థియేటర్లలో ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు సైతం చేరువగా వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎమోషనల్ కంటెంట్ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చేశాయి.

అనిల్ రావిపూడి - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సందేశాత్మక కథతో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ ఇటీవలే బయటకు వచ్చింది. అంటే అక్టోబర్ 19వ తేదీన విడుదలైన 'భగవంత్ కేసరి' డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నవంబర్ 23 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకు వచ్చే 'భగవంత్ కేసరి' మూవీలో దంచవే మేనత్త కూతురా సాంగ్‌ను కూడా యాడ్ చేసి చూపించబోతున్నారని సమాచారం. అలాగే, సెన్సార్ బోర్డ్ కట్ చేసిన కొన్ని డైలాగులును, సన్నివేశాలను కూడా ఇందులో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. బాలయ్య కెరీర్‌లోనే మంచి సెంటిమెంట్‌తో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











