twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: బాలకృష్ణ షో రికార్డుల మోత.. ఆ ఎపిసోడ్ కి హై రేంజ్ రెస్పాన్స్!

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జిటిక్ గా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. అందుకే ఉదాహరణే బాలకృష్ణ హోస్ట్ గా మారిన 'Unstoppable with NBK' షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతోందన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు. ఈ సీజన్ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సీజన్ ఇప్పటివరకు ఐదు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ఐదో ఎపిసోడ్ ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.

    డైరెక్టర్స్, పొలిటిషియన్స్ తో ఆసక్తిగా..

    డైరెక్టర్స్, పొలిటిషియన్స్ తో ఆసక్తిగా..

    సినిమాల్లో డ్యాన్స్ లు, ఫైట్ లతో చెలరేగిపోయే నందమూరి నటసింహం బాలకృష్ణ డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసి సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో వరుసగా ఎపిసోడ్స్ ను వదిలారు. అందులో యంగ్ హీరోల నుంచి సీనియర్ డైరెక్టర్స్, పొలిటిషియన్స్ ఎంతోమంది వచ్చి అలరించారు.

    40 ఏళ్ల నుంచి వీళ్ల మధ్యనే..

    40 ఏళ్ల నుంచి వీళ్ల మధ్యనే..

    'Unstoppable 2' షో మొదటి సీజన్ కంటే కూడా రెండో సీజన్ మరింత ఆసక్తికరంగా డిఫరెంట్ గెస్టులతో ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 5వ ఎపిసోడ్ లో టాప్ టాలీవుడ్ లెజెండ్స్ కనిపించారు. నిర్మాతలు అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు, సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు హాజరయ్యారు. వీరంతా కలిసి 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన కొన్ని సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబు ముందు షోలోకి రాగా ఆ తరువాత కె.రాఘవేంద్రరావు ఎంట్రీ ఇచ్చారు. జీవితమంతా 40 ఏళ్ల నుంచి వీరి ఇద్దరి మద్యే సాండ్ విచ్ అయ్యాను. మళ్లీ ఇక్కడ కూడా అంతేనా అని రాఘవేంద్రరావు సరదాగా జోక్ చేశారు.

    బొడ్డు మీద యాపిల్..

    బొడ్డు మీద యాపిల్..

    అల్లు అరవింద్ కె.రాఘవేంద్రరావు తో పాటు BA ట్యాగ్ గురించి కూడా వివరణ ఇచ్చారు. బిఏ అంటే బొడ్డు మీద యాపిల్ అని సమాధానం ఇచ్చారు. ఇక రాఘవేంద్రరావు మరో సమాధానం ఇస్తూ.. న్యూటన్ యాపిల్ పడేటప్పుడు గ్రావిటీ కనిపెట్టారు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను అని అందరినీ నవ్వించారు. ఇంకా అల్లు అరవింద్, సురేష్ బాబులను నెపోటిజం గురించి అడిగారు బాలకృష్ణ. పలు సినిమాల గురించి చర్చించారు. ఇలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఎపిసోడ్ ను రెండు రోజుల్లో 30 మిలియన్స్ మినిట్స్ పాటు వీక్షకులు చూశారాని ఆహా వెల్లడించింది. ఇదొక రికార్డుగా నమోదైంది. అంతేకాకుండా 'Unstoppable 1' సీజన్ ఐఎండీబీలో టాప్ రేటెడ్ తెలుగు షోగా రికార్డు క్రియేట్ చేసింది.

    అతనితో సీజన్ ముగింపు..

    ఇదిలా ఉంటే Unstoppable 2 సీజన్‌లో పవన్ కల్యాణ్ పాల్గొనే ఎపిసోడ్ ఇప్పటికే ఖరారైందని ఆహా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే పవన్ పాల్గొనే ఎపిసోడ్ తోనే ఈ సీజన్‌ ముగిస్తుందట. Unstoppable 2 సీజన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ పాల్గొనే పవర్ ఎపిసోడ్ తో ముగుస్తుందనేది సినీ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం. అయితే ఈ విషయంపై పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదనేది మరో వార్త.

    English summary
    Tollywood Senior Hero Nandamuri Balakrishna Talk Show Unstoppable With NBK Season 2 5th Episode With Allu Aravind Raghavendra Rao Suresh Babu Creates Sensation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X