twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: ఓటీటీలో బాలకృష్ణ సెన్సేషన్.. దెబ్బకు థింకింగ్ మారిపోయిందిగా!

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా డిజిటల్ తెరపై కూడా రికార్డులు క్రియేట్ చేశాడు. బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యహరించిన టాక్ షో అన్‌స్టాపబుల్. ఒక రకమైన క్రేజ్ తో వచ్చిన ఈ టాక్ షో ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా రెండో సీజన్ ను ప్రారంభించింది ఆహా ఓటీటీ. అన్‌స్టాపబుల్ 2 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఇలా ప్రారంభమైందో లేదో అలా రికార్డుల మోత మోగిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    డిజిటల్ తెరపై కూడా..

    డిజిటల్ తెరపై కూడా..

    టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ డిజిటల్ తెరపై కూడా రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీ ఎక్స్ క్లూజివ్ గా రూపొందించిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'. ఈ టాక్ షో ద్వారా తొలిసారిగా డిజిటల్ తెరపై ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. ఈ టాక్ షో ఐఎండీబీలో హైయెస్ట్ రేటెడ్ టాక్ షోగా నిలిచి రికార్డు కెక్కింది.

    అసాధరణ రెస్పాన్స్ తో..

    అసాధరణ రెస్పాన్స్ తో..

    ఈ టాక్ షోకు వచ్చిన అసాధరణ రెస్పాన్స్ తో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' రెండో సీజన్ ను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్ తోనే గ్రాండ్ ప్రారంభాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతోనే రికార్డుల వేట స్టార్ట్ చేసిన బాలకృష్ణ.. ఫుల్ ఎపిసోడ్ విడుదల తర్వాత కూడా అదే జోష్ కనబర్చారు.

    స్పెషల్ అట్రాక్షన్ గా..

    స్పెషల్ అట్రాక్షన్ గా..

    ఈ షోకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆయన కుమారుడు నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలకృష్ణ, చంద్రబాబు ఇద్దరు బావమరుదులు, వియ్యంకులు కావడం ఒకటైతే.. బాలకృష్ణకు నారా లోకేష్ మేనల్లుడే కాకుండా పిల్లనిచ్చిన అల్లుడు కావడంతో ఈ ఎపిసోడ్ పై మరింత క్రేజ్ పెరిగింది.

    1995 సంవత్సరంలో..

    1995 సంవత్సరంలో..

    అంతేకాకుండా ఈ ఎపిసోడ్ లో వీళ్లు ముగ్గురు కలిసి 1995 సంవత్సరంలో జరిగిన రాజకీయం, టీడీపీలో ఏర్పడిన అనిశ్చితి, ఫ్యామిలీ విషయాలు, టీడీపీ పార్టీ రూపకర్త, దివంగత సీనియర్ ఎన్టీఆర్, వైరల్ అయిన లోకేష్ ఫొటోలు తదితర అంశాలపై చర్చించడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ఎపిసోడ్. దీంతో ఈ ఎపిసోడ్ కు వ్యూస్ ఓ రేంజ్ లో వచ్చాయి.

    24 గంటల్లో..

    'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్ కు 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించిందని ఆహా తాజాగా వెల్లడించింది. సెన్సేషనల్ ఎపిసోడ్ సెన్సెషన్ క్రియేట్ చేస్తోందని, నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ఓటీటీ రికార్డులు తిరగరాస్తున్నారని ఆహా పేర్కొంది. మరోవైపు యూట్యూబ్ లో కూడా ప్రోమో రికార్డుల మోత మోగిస్తూ 3 రోజులుగా టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఈ షో పట్ల దెబ్బకు థింకింగ్ మారిపోయిందిగా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

    English summary
    Tollywood Senior Hero Nandamuri Balakrishna Talk Show Unstoppable With NBK Season 2 First Episode With Nara Chandrababu Naidu And His Lokesh Creates Sensation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X